Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో పోటీపై కమల్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   6 Feb 2019 9:57 AM GMT
ఎన్నికల్లో పోటీపై కమల్ సంచలన నిర్ణయం
X
సీనినటుడు, ముక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ లోక్ సభ ఎన్నికల బరిలో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారిగా ఎన్నికలకు వెళుతున్నందున ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని కమల్ నిర్ణయించుకున్నారు. పార్టీ నాయకులు, అభిమాన సంఘాల నాయకులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఒంటిరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కమల్ హాసన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ మక్కల్ నీది మయ్యం పార్టీ తమిళనాడులోని 40 లోక్ సభ స్థానాల్లో ఒంటిరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. పార్టీ నాయకులు, అభిమానుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆయన గత కొంతకాలంగా అన్నాడీఎంకే ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయన అక్కడి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతో కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది.

అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కిందటేడాది స్వయంగా కమల్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దీంతో ఆమ్ అద్మీతో కలిసి మక్కల్ నిధి మయ్యం పార్టీ పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. అయితే కమల్ అనుహ్యంగా లోక్ సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం బీజేపీతో అన్నాడీఎంకే, కాంగ్రెస్ తో డీఎంకే పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెల్సింది. ఇక విజయ్ కాంత్ సైతం తన పార్టీ అభ్యర్థులను ఒంటరిగా బరిలో దింపాలని చూస్తున్నారని సమాచారం.

మొదటి ఎన్నికల బరిలో నిల్చుంటున్న కమల్ అధికార, ప్రతిపక్ష పార్టీలను ఎలా ఎదుర్కొంటారనే ఆసక్తిగా మారింది. ఏదిఏమైనా కమల్ ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. ‘సింహం సింగిల్ గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయని అన్నట్టు కమల్ సింగిల్ గానే వస్తున్నాడు. సో కమల్ నిర్ణయం కరెక్టా లేదా అనేది మాత్రం ఎన్నికల అనంతరమే తేలనుంది. సో అంతవరకు వేచి చూడాల్సందే మరీ..