Begin typing your search above and press return to search.

కేంద్రానికి విశ్వ‌న‌టుడి సంచ‌ల‌న వార్నింగ్‌

By:  Tupaki Desk   |   3 Jun 2017 6:39 AM GMT
కేంద్రానికి విశ్వ‌న‌టుడి సంచ‌ల‌న వార్నింగ్‌
X
ఒకే దేశం.. ఒకే ప‌న్ను పేరిట భారీ ప్ర‌చారంతో.. కోటి ఆశ‌ల‌తో మ‌రో నెల వ్య‌వ‌ధిలో (క‌చ్ఛితంగా చెప్పాలంటే నెల కంటే త‌క్కువ వ్య‌వ‌ధే ఉంది) జీఎస్టీ ప‌న్నును అమ‌లు చేయాల‌నుకుంటున్న సంగ‌తి తెలిసిందే. జీఎస్టీకి సంబంధించి ఇప్ప‌టికే ప‌లువురు ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే.. తాజాగా విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ నుంచి ఊహించ‌ని డిమాండ్ ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది.

జీఎస్టీలో భాగంగా సినిమాల మీద 28 శాతం ప‌న్ను విధించ‌టంపై పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంత భారీ ప‌న్నుతో సినిమాలు తీవ్రంగా ప్ర‌భావితం అవుతాయ‌ని.. అంత ప‌న్ను విధించ‌టం ఏమాత్రం స‌రికాదంటూ ద‌క్షిణాదికి చెందిన సినీ ప్ర‌ముఖులు ప‌లువురు పెద్ద ఎత్తున త‌ప్పు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. జీఎస్టీ ప‌న్ను విధింపుపై తాజాగా విఖ్యాత సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తీవ్రంగా స్పందించారు. సినిమాపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీ ని కేంద్రం తొల‌గించాల‌ని.. లేదంటే త‌గ్గించాల‌ని.. అలా కాకుంటే తాను సినిమాల నుంచి త‌ప్పుకుంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సినిమాల‌పై విధించిన 28 శాతం జీఎస్టీని త‌గ్గించాలంటూ సినీ ప్ర‌ముఖులు కోరుతున్నా.. కేంద్రం నుంచి ఎలాంటి రియాక్ష‌న్ రాని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. ద‌క్షిణ భార‌త చ‌ల‌న‌చిత్ర వాణిజ్య మండ‌లి శుక్ర‌వారం చెన్నైలో అత్య‌వ‌స‌రంగా స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌మ‌ల్ హాస‌న్ మాట్లాడుతూ.. ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రోవైపు ఛాంబ‌ర్ అధ్య‌క్షులు ఎల్‌కే సురేష్.. థియేట‌ర్ య‌జ‌మానుల సంఘం త‌ర‌ఫున అభిరామి రామ‌నాథ‌న‌.. ఛాంబ‌ర్ గౌర‌వ కార్య‌ద‌ర్శి కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్న ఈ స‌మావేశంలో సినిమాల‌పై విధించిన 28 శాతం ప‌న్నును 12 శాతానికి లేదంటే 18 శాతానికైనా త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. జీఎస్టీ కోసం త‌న కెరీర్‌ను ప‌ణంగా పెడుతూ విశ్వ‌నటుడి అల్టిమేటంను మోడీ స‌ర్కారు స్పందిస్తుందా? లేదా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. మొత్తానికి క‌మ‌ల్ హాస‌న్ సినిమా రావ‌టమా? లేదా? అన్న‌ది ఇప్పుడు పూర్తిగా ప్ర‌ధాని మోడీ చేతుల్లో ఉన్న‌ట్లు అనిపించ‌ట్లేదు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/