Begin typing your search above and press return to search.
శత్రువుకు శత్రువు కూడా..కమల్ కు శత్రువే!!
By: Tupaki Desk | 4 Jan 2018 12:49 PM GMTతమిళ రాజకీయాల్లోకి ఆయన ఇంకా గట్టిగా అడుగు పెట్టలేదు. కానీ... రాజకీయ వివాదాలు మాత్రం ఆయనను పుష్కలంగా చుట్టు ముడుతున్నాయి. తమిళ రాజకీయ యవనికపై కమల్ హాసన్, ఈ టీవీ దినకరన్ ల మధ్య అప్పుడే లడాయీ మొదలైంది. రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు... అని సామెత. అయితే ఈ సిద్ధాంతం కమల్ హాసన్ వద్ద పని చేయడంలేదు. అటు కేంద్రంలోని మోడీ సర్కారుతోను, ఇటు రాష్ట్రలోని అన్నా డీఎంకే సర్కారుతోనూ శతృత్వాన్ని కొనసాగిస్తున్న కమల్ హాసన్... ఆ ఇద్దరికీ కొత్త శత్రువుగా ఆవిర్భవిస్తున్న టీటీవీ దినకరన్ ను కూడా శత్రువుగా మార్చుకుంటునన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక గురించి కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇద్దరి మధ్య వైరానికి - విమర్శలు- ప్రతివిమర్శలకు కారణం అవుతున్నాయి.
ఆర్కే నగర్ లో భారీ మెజారిటీతో గెలిచిన టీటీవీ దినకరన్.. జయలలితకు తానే వారసుడిని అని చెప్పుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆనంద వికటన్ అనే తమిళ పత్రికకు ఒక వ్యాసం రాసిన కమల్ హాసన్.. అందులో ఆర్కే నగర్ లో విజయం అనేది ఓట్లతో వచ్చింది కాదని - కొనుక్కున్నదని వ్యాఖ్యానించారు. దినకరన్ పేరు ఆ వ్యాసంలో ప్రస్తావించకపోయినప్పటికీ.. సూటిగా ఆ విమర్శ ఆయనను ఉద్దేశించిందే. ఈ నేపథ్యంలో దినకరన్ కమల్ పట్ల మరింత ఘాటుగానే ప్రతిస్పందించారు.
రాజకీయం అంటే.. ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే సినిమా రంగం కాదు అంటూ కమల్ హాసన్ మీద దినకరన్ సూటిగానే విరుచుకుపడుతున్నారు. కమల్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. ఆర్కేనగర్ ప్రజలు తనకు విజయాన్ని కట్టబెట్టిన మాట వాస్తవం అని ఆయన అంటున్నారు. కమల్ హాసన్ అక్కడి విజయం కొనుక్కున్నది అని వ్యాఖ్యానించడం ద్వారా.. తనను తప్పు పట్టినట్లుగా లేదని.. నియోజకవర్గంలోని ప్రజలను అవమానించినట్లుగా ఉన్నదని దినకరన్ దెప్పిపొడిచారు. తన విజయం గురించి వ్యాఖ్యానించడానికి కమల్ హాసన్ ఏమైనా దేవుడా - న్యాయమూర్తా అని కూడా కమల్ పేర్కొనడం విశేషం. కమల్ ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు.. ఆయన పార్టీ అంటూ పెడితే.. ఆయన వెంటనడుస్తాం అంటూ మైత్రిని ప్రకటించిన వారు ఇంకా తెరమీదికి రావడం లేదు. మిత్ర కూటమిగా ఆయన వెంట ఎవరుంటారో ఇంకా తేలడం లేదు గానీ.. శత్రువుల సంఖ్యను మాత్రం కమల్ పెంచుకుంటూ పోతున్నారని జనం అనుకుంటున్నారు.