Begin typing your search above and press return to search.
ప్రధాని ప్యాకేజీని స్వాగతిస్తున్నా..కానీ, : కమలహాసన్
By: Tupaki Desk | 13 May 2020 7:50 AM GMTమహమ్మారి కారణంగా చిన్నాభిన్నమైన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి చేయూతగా నిలవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. సోమవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ..ఆ తరువాత మంగళవారం జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ...ఈ వైరస్ కట్టడికి మరోసారి లాక్ డౌన్ తప్పదని, ఈసారి కొత్త రూల్స్ తో సరికొత్త లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనడం తెలిసిందే. అలాగే, ఆర్థిక వ్యవస్థ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భం గా మోదీ ప్రకటించిన భారీ ఉద్దీపన ప్యాకేజీ పై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ ఎం) పార్టీ అధినేత కమలహాసన్ స్పందించారు. ప్రధాని పేర్కొన్న అంశాలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుత కరోనా సంక్షభంలో పేదవాడే అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్వాలంబనే శరణ్యమని, స్వయం సమృద్ద భారత్ ఆవశ్యకమని పేర్కోన్న ప్రధాని వ్యాఖ్యలతో మేము అంగీకరిస్తున్నాం. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని స్వాగతిస్తున్నాం. అయితే ఈ ప్యాకేజీ పై కేంద్ర ఆర్థిక మంత్రి మరిన్న వివరాలు తెలుపుతారని పేర్కొనాన్నరు. అన్నీ బాగానే ఉన్నా అంతిమంగా దేశంలోని నిరుపేదలు ఏ మేరకు లబ్ధిపొందుతారో వేచి చూడాలి’ అంటూ కమల్ ట్వీట్ చేశారు.