Begin typing your search above and press return to search.
మోదీ సర్కారుపై కమల్ తీవ్ర వ్యాఖ్యలు
By: Tupaki Desk | 19 Dec 2019 3:55 AM GMTకేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం ఎంతగా దుమారం రేపుతోందో తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ విషయంలో మోడీ సర్కారు తీరును తప్పుబడుతున్నాయి. ఆ జాబితాలోకి తమిళ లెజెండరీ నటుడు, మక్కళ్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా చేరాడు. ఈ చట్టాన్ని అమలు చేసే విషయంలో బీజేపీ ప్రభుత్వం క్రమేపీ నియంతలా వ్యవహరిస్తోందని కమల్ వ్యాఖ్యానించాడు. ఈ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు పలికాడు.
బుధవారం మద్రాస్ యూనివర్సిటీకి చేరుకున్న కమల్‌ను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ గేటు బయటే మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్.. ఇది కేవలం విద్యకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, దేశానికి కూడా సంబంధించినదని అన్నారు.ఈ దేశాన్ని మించిన బిల్లు ఏదీ లేదని.. ఈ చట్టం విద్యార్థులకు, ప్రజలకు మంచిది కాదని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు తనను అనుమతించలేదని... అయితే తాను చనిపోయేంతవరకు విద్యార్థిగానే పిలుచుకుంటానని.. అందుకే విద్యార్థుల పక్షాన మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చానని కమల్ అన్నాడు.. తాను పార్టీని ఏర్పాటు చేసినా, చేయకున్నా తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని, పార్టీని స్థాపించాను గనుక.. ఇక్కడికి రావడం తన కర్తవ్యంగా భావించానని కమల్ చెప్పాడు.