Begin typing your search above and press return to search.
స్టార్ దూకుడు : రాజకీయ గేరు మారుతోంది!
By: Tupaki Desk | 15 Jan 2018 7:13 AM GMTతమిళ సూపర్ స్టార్ లలో ఒకరైన కమల్ హాసన్ రాజకీయ పార్ట విషయంలో గేర్ మార్చి ముందుకు సాగబోతున్నారు. ఒకవైపు రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీని ప్రకటించి.. పార్టీ నిర్మాణ కార్యకలాపాల్లో ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తుండగా.. ఇటువైపు కమల్ కూడా రాజకీయంగా గేరప్ అవుతున్నారు. రజనీకంటె కొన్ని నెలల ముందుగానే రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టంగా తేల్చిచెప్పనప్పటికీ.. కమల్ హాసన్ యాక్టివిటీ ఇంకా చురుగ్గా మొదలు కాలేదు. రాజకీయ ప్రస్థానానికి సంబంధించి.. అన్ని వివరాలను మరో రెండు రోజుల్లో వెల్లడి చేసి.. రాష్ట్రవ్యాప్త యాత్ర ప్రారంభించడానికి కూడా కమల్ సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కమల్ హాసన్ రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత.. తన రాజకీయ విధానాలపై స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అటు అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్షడీఎంకే, భాజపా, కాంగ్రెస్ లకు కూడా సమానమైన దూరం మెయింటైన్ చేస్తానని కమల్ ఇప్పటికే చెప్పారు. ప్రస్తుత పాలన మీద కూడా నిశిత విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. టీటీవీ దినకరన్ విజయం మీద కూడా వివాదాస్పద విమర్శలు చేసి.. తన పార్టీ పూర్తి స్వతంత్రంగా వీరెవ్వరి ప్రభావం లేకుండా ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. తీరా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కూడా కమల్ సిద్ధమవుతూ ఉండడం అనేది.. ఆయన దూకుడుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
ఈ మధ్య కాలంలో రజనీ కూడా పార్టీ ప్రకటించిన తర్వాత.. రజనీ సిద్ధాంతాలు తెలిసిన తర్వాత.. ఆయనతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమే అని కూడా కమల్ ప్రకటించారు. ఆ మాట అన్నంత మాత్రాన కమల్ పార్టీ విషయంలో వెనకడుగు వేస్తారని ఎవరూ అనుకోలేదు. కాకపోతే.. ఇప్పటి పరిస్థితుల్లో.. ఇద్దరు సూపర్ స్టార్లు రెండు పార్టీలు నడిపితే.. రాజకీయాల్లో దాని ప్రభావం ఎలా ఉండబోతుందో కదా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.
ఎంతచెడ్డా సినీప్రస్థానంనుంచి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ఈ ఇద్దరు నాయకుల మధ్య ఒక సారూప్యత కనిపిస్తోంది. ఇద్దరూ రాజకీయ అరంగట్రం గురించి నానా హడావిడి చేస్తున్నారు గానీ.. ఇద్దరూ ఇప్పటిదాకా తమ తమ పార్టీ పేరును ప్రకటించలేదు. ప్రజలను నేరుగా కలిసిన తర్వాత.. పార్టీ పేరును ప్రకటిస్తానంటూ కమల్ సెలవిచ్చారు. రజనీ కూడా ఇంచుమించు అవే మాటలను మార్చి చెబుతున్నారు. పేరు సంగతి ఎలా ఉన్నా కమల్ ఈ నెలలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభిస్తే గేరు మార్చి దూకుడు చూపించినట్లు వుతుంది.