Begin typing your search above and press return to search.

లోక‌నాయ‌కుడు ప‌రాజ‌యం.. ప్ర‌జానాడి ప‌ట్ట‌డంలో విఫ‌లం!

By:  Tupaki Desk   |   3 May 2021 8:30 AM GMT
లోక‌నాయ‌కుడు ప‌రాజ‌యం.. ప్ర‌జానాడి ప‌ట్ట‌డంలో విఫ‌లం!
X
సినీ యాక్ట‌ర్ల‌కు-పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు చాలా తేడా క‌నిపిస్తోంది. 1980 ద‌శ‌లో యాక్ట‌ర్లు రాజకీయాల్లోకి వ‌చ్చి.. స‌క్సెస్ అయినా.. త‌ర్వాత కాలంలో మాత్రం ఎవ‌రూ పెద్ద‌గా పొలిటిక‌ల్ తెర‌పై హిట్ కొట్టిన సంద‌ర్భం మ‌న కు క‌నిపించ‌దు.అప్ప‌ట్లో త‌మిళ‌నాట ఎంజీఆర్‌, ఆయ‌న త‌ర్వాత జ‌య‌ల‌లిత‌.. రాజ‌కీయంగా ప్ర‌జ‌ల మ‌న సులు చూర‌గొన్నారు. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో గూడుక‌ట్టుకున్న నంద‌మూరి తార‌క రామారావు హిట్ట‌య్యారు. పార్టీ పెట్టారు. వెంట‌నే అధికారం చేప‌ట్టారు. ఇక‌, ఆ త‌ర్వాత ఏపీలోనూ సినీ హీరోలు .. రాజకీయంగా స‌క్సెస్ బాట ప‌ట్టింది లేదు.

ఈ వ‌రుస‌లో ప్ర‌జారాజ్యం పేరుతో సామాజిక మార్పు తీసుకువ‌స్తాన‌న్న చిరంజీవి 18 స్థానాల్లో గెలిచి.. పార్టీని ఏకంగా కాంగ్రెస్‌లో క‌లిపేశారు. ఇక‌, ఆయ‌న సోద‌రుడు.. ప‌వ‌న్ గ‌త 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. కేవ‌లం ఒక్క‌స్థానంతో స‌రిపెట్టుకున్నారు. పైగా త‌ను రెండు చోట్ల పోటీ చేసినా.. ఓడిపోయారు. అంటే.. మొత్తంగా తెలుగు నాట అన్నగారి త‌ర్వాత‌.. ఏ నాయ‌కుడు కూడా విజ‌యం ద‌క్కించుకున్న ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. ఇక‌, త‌మిళ‌నాడు అసెంబ్లీకి తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విశ్వ‌న‌టుడు.. క‌మ‌ల్ హాస‌న్‌.. ఘోర ప‌రాజ‌యం చ‌వి చూశారు.

మ‌క్క‌ల్ నీది మ‌య్యం(ఎంఎన్ ఎం) పార్టీని కొన్నాళ్ల కింద‌టే స్థాపించిన క‌మ‌ల్‌.. ప్ర‌జ‌ల్లోకి బాగానే ప్ర‌చారం చేశారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కోయంబ‌త్తూరు ద‌క్షిణం నుంచి పోటీకి దిగిన ఆయ‌న త‌న ప్ర‌చారం కూడా బాగానే చేసుకున్నారు. ఇక‌, ఎంఎన్ ఎం పార్టీ త‌ర‌ఫున మొత్తం 214 స్థానాల్లో అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచినా.. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. అయితే.. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. చివ‌రి వ‌ర‌కు కూడా క‌మ‌ల్‌.కు ప‌డిన ఓట్లు, ఆధిక్య‌త వంటివి దోబూచులాడుతూ వ‌చ్చాయి. ఇక్క‌డ గెలిచిన బీజేపీ అభ్య‌ర్థిపై క‌మ‌ల్ పోరు.. క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ‌నురేపినా.. చివ‌ర‌కు ఓడిపోయారు.

ఇక‌, క‌మ‌ల్ ఓట‌మి ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల్లో ఈయ‌న ప‌ట్టు సాధించ‌లేక పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. తాను గీసుకున్న గీత‌లే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌జ‌ల‌కు రూపాయి ఇచ్చేది లేద‌ని.. ఓట్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలో కొనేది లేద‌ని.. క‌మ‌ల్ అనేక సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. అంతేకాదు, త‌న పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్య‌ర్థుల‌కు కూడా ఆయ‌న పెద్ద‌గా ఎన్నిక‌ల నిధులు ఇవ్వ‌లేదు. దీంతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ పేరు కూడా ప్ర‌స్థావ‌న‌కు రాలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే.. మ‌రోవైపు డీఎంకే, అన్నాడీఎంకేలు ప్ర‌జ‌ల‌కు హామీల వ‌రాలు ఇచ్చాయి. ప్ర‌తి ఇంటికీ అనేక హామీలు గుప్పించాయి. ఎన్నిక్ల‌లో డ‌బ్బులు కూడా పంచారు. ఇలాంటి నేప‌థ్యంలో క‌మ‌ల్ తాను గీసుకున్న బ‌రిని దాట‌లేక‌పోవ‌డం కూడా త‌న ఓట‌మికి కార‌ణ‌మ‌ని అంటున్నారు. అయితే.. ఎ న్నిక‌ల ప‌రంగా ఓడినా.. నైతిక‌త ప‌రంగా ఆయ‌న గెలిచార‌ని అంటున్నారు మేధావులు.