Begin typing your search above and press return to search.
ఊహించిందే జరిగింది.. సీఎం పదవికి కమల్ నాథ్ రాజీనామా
By: Tupaki Desk | 20 March 2020 8:06 AM GMTతీవ్ర ఉత్కంఠకు మారిన మధ్యప్రదేశ్ రాజకీయాలు తుది అంకానికి చేరుకున్నాయి. అందరూ ఊహించినట్టుగానే ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పక్కదారి పట్టడంతో తనకు బలం లేదని తెలిసీ బల పరీక్షకు ముందే కమల్ నాథ్ తన సీఎం పదవి నుంచి వైదొలిగారు. సుప్రీంకోర్టు ఆదేశాల తో శుక్రవారం సాయంత్రం బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా దానికన్నా ముందే రాజీనామా చేయడం తో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 15 నెలలకే కాంగ్రెస్ చేజేతులా తన ప్రభుత్వాన్ని కోల్పోయింది.
మధ్యప్రదేశ్ లో కీలక నాయకుడిగా ఉన్న యువ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. ఆ సమయం లో ముఖ్యమంత్రిగా తనను నియమిస్తారని భావించగా సీనియర్ నాయకుడిగా ఉన్న కమల్ నాథ్ ను సీఎం పీఠంపై కూర్చొబెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం లో జ్యోతిరాదిత్యకు ప్రాధాన్యం దక్కలేదు. దీనికితోడు పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ సీఎం కమల్ నాథ్ తో కలిసి జ్యోతిరాదిత్యను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ పరిణామాలన్ని అధిష్టానానికి చెప్పినా స్పందన లేకపోవడం తో ఇక చివరకు జ్యోతిరాదిత్య బయటకు రావడం తో మధ్యప్రదేశ్ రాజకీయాలు రసకందాయంగా మారిన విషయం తెలిసిందే. జ్యోతిరాదిత్య తనతో పాటు ఆరుగురు మంత్రులు సహా 22 మంది ఎమ్మెల్యేలను తీసుకుని కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేశారు.
అయితే వీరిని బుజ్జగించి తిరిగి తీసుకురావడం లో కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కమల్ నాథ్ విఫలమయ్యారు. దీంతో చివరకు ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా చేసి బల పరీక్షకు ముందే ఓటమిని అంగీకరించారు. ప్రస్తుతం ప్రభుత్వం నిలబడాలంటే 114 మంది ఉండాల్సి ఉండగా కమల్ నాథ్ వెంట 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఆయన ప్రభుత్వం నుంచి వైదొలిగారు. 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం లో సింధియా కీలక పాత్ర పోషించారు. కానీ స్వల్ప మెజార్టీ రావడం తో ఆయనకు సీఎం పదవి దక్కలేదు. పీసీసీ చీఫ్ పదవి, రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కకుండా కమల్ నాథ్, దిగ్విజయ్ అడ్డుకోవడం తో సింధియా అదును చూసి బీజేపీలో చేరడంతో మధ్యప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయాలకు కారణమైంది.
మధ్యప్రదేశ్ లో మొత్తం ఎమ్మెల్యేలు 230 మంది
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సింది 104 మంది
కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉండగా ప్రస్తుతం 92కు పడిపోయింది.
బీజేపీకి 107 మంది
16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామా