Begin typing your search above and press return to search.
డీఎంకే సునామీలో కొట్టుకుపోయిన కమల్ హాసన్ పార్టీ
By: Tupaki Desk | 2 May 2021 2:40 PM GMTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ సునామీ సృష్టించింది. ఆ సునామీలో భారీ ఆశలు పెట్టుకున్న అగ్రహీరో కమల్ హాసన్ పార్టీ కొట్టుకుపోయింది. అధికార అన్నాడీఎంకే రెండంకెలకే పరిమితమైంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే 125 స్థానాల్లో ఆధిక్యం సాధించగా.. అన్నాడీఎంకే 77 స్తానాల్లో ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగిలిన పార్టీలన్నీ కొట్టుకుపోయాయి.
లోక నాయకుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ పరిస్థితి సైతం దారుణంగా ఉంది. ఆ పార్టీ కేవలం ఒకే ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అది కూడా కమల్ హాసన్ పోటీచేస్తున్న కోయంబత్తూర్ సౌత్ స్థానంలోనే కావడం విశేషం.
కమల్ హాసన్ 15వేల పైచిలుకు ఓట్లను గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ జయకుమార్ 12 వేల పైచిలుకు ఓట్లు.. మూడో స్థానంలో బీజేపీకి చెందిన వాసంతి శ్రీనివాస్ 11 వేల పైచిలుకు ఓట్లను సొంతం చేసుకున్నారు. దాదాపు 2వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో కమల్ ఉన్నారు.
కడపటి వార్తలు అందేసరికి కమల్ హాసన్ వెనుకబడ్డారని సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుండడంతో ఫలితం వచ్చేవరకు ఆలస్యం అయ్యేలా ఉంది.