Begin typing your search above and press return to search.

దోసెలతో అమెరికాలో మన ‘కమల’ ప్రచారం

By:  Tupaki Desk   |   29 Nov 2019 11:36 AM GMT
దోసెలతో అమెరికాలో మన ‘కమల’ ప్రచారం
X
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. 2020లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రెసిడెంట్ రేసులోని అభ్యర్థులు అందరూ ప్రజలను ఆకట్టుకోవడానికి వింత వింత ప్రచారాలు చేపడుతున్నారు. ప్రత్యర్థుల బలహీనతలు, వాళ్ల బలాలు తెలుసుకుంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు.

అమెరికా అధ్యక్ష రేసులో ఈసారి ట్రంప్ తో పోటీపడేందుకు మన భారత సంతతికి చెందిన కమల హారిస్ సై అంటే సై అంటున్నారు. డెమోక్రాట్ పార్టీ నుంచి కమల అధ్యక్ష రేసులో పోటీపడుతున్నారు. సెనేటర్ గా ఉన్న కమల తాజాగా భారతీయ ఓటర్లను ఆకట్టుకున్నారు.

దక్షిణ భారత్ లోని మద్రాస్ లో కమల హారీస్ తాతలు ఉండేవారు. స్వతహాగా భారత సంతతికి చెందిన కమల హారీస్ 2020లో డెమోక్రాట్ పార్టీ తరుఫున అధ్యక్ష రేసులో ఉన్నారు. ఈమె ట్రంప్ పై విమర్శలు చేస్తూ ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు వెరైటీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇండియన్స్ ఓట్ల కోసం తాజాగా ‘దోసెల’ ప్రచారం మొదలుపెట్టారు.

ప్రముఖ ఇండో అమెరికన్ నటి, రచయిత మిండీ కలింగ్ తో కలిసి తాజాగా వంటల కార్యక్రమంలో కమల హారీస్ పాల్గొన్నారు. లాస్ ఎంజిల్స్ లోని మిండీ కలింగ్ నివాసానికి వెళ్లి దక్షిణ భారత వంటకమైన మసాలా దోసను వేశారు. ఇండియాతో తనకున్న అనుబంధాన్ని వీడియోలో పంచుకున్నారు.

తాజాగా ఈ వీడియోను కమలహారీస్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. లక్షల కొద్ది ఇండియన్స్, ప్రవాస భారతీయులు ఆమెకు లైకులు, షేర్లు చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. ఇలా ప్రవాస భారతీయుల ఓట్లను సంపాదించేందుకు కమల హారీస్ వినూత్న ప్రచారాన్ని మొదలు పెట్టారు.

వీడియో ఇదే..
https://www.youtube.com/watch?v=xz7rNOAFkgE&feature=emb_title