Begin typing your search above and press return to search.
ఇలాంటి యాంగిల్స్ కామారెడ్డి జెడ్సీ ఛైర్ పర్సన్ మాత్రమే చెప్పగలరేమో?
By: Tupaki Desk | 12 Dec 2019 5:18 AM GMTమనల్ని పాలించే పెద్ద మనషుల ఆలోచనలు ఇంత చిన్నగా ఉంటాయా? ఇలాంటి వారి సారథ్యంలో లక్షలాది ప్రజల జీవితాలు.. వారి భవిష్యత్తు ఉంటుందా? అన్న భావనకే ఒళ్లు జలదరించేలా కొన్ని వ్యాఖ్యలు ఉంటాయి. తాజాగా అలాంటి వ్యాఖ్యే చేసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు కామారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సనర్ దఫేదార్ శోభ. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్యాచార ఉదంతంలో ఇప్పటివరకూ ఎవరికి తోచని కొత్త యాంగిల్ ను తెర మీదకు తెచ్చిన ఆమె మాటలు విన్నంతనే ఒళ్లు మండేలా చేయక మానదు.
తాజాగా ఒక సమావేశంలో మాట్లాడిన ఆమె.. దిశ తల్లిదండ్రులకు కాకుండా చెల్లికి ఫోన్ చేయటం ఏమిటి? గెజిటెడ్ అధికారిగా ఉన్న ఆమెకు ఏ సమయంలో ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలీదా? దిశకు వారి తల్లిదండ్రులకు మధ్య అంత సఖ్యత ఉన్నట్లుగా లేదన్న మాటలు చూస్తే.. ఇలా ఆలోచించాలన్న తీరే ఇబ్బంది కలిగించక మానదు.
ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఏర్పడితే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయటం తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వారితో సంబంధాలు సరిగా లేకపోవటం కాదు. తమ భయాన్ని.. ఆందోళనల్ని వారికి చెబితే.. తమ కంటే ఎక్కువగా వారు కలత చెందుతారన్న ఆలోచనే. దిశ విషయానికి వస్తే.. తాను ప్రమాదంలో ఉన్నానేమోనన్న సందేహాన్ని తన చెల్లికి ఫోన్ చేసి చెప్పిందే తప్పించి మరెవరికీ కాదన్నది మర్చిపోకూడదు.
రెండు.. మూడు సంవత్సరాల తేడాతో ఉండే అక్కాచెల్లెళ్లు.. అన్నాతమ్ముళ్ల మధ్య అనుబంధం బలంగా ఉండాలనుకోవటం తప్పు కాదు. కానీ.. అందులోనూ లోపం వెతికి.. అరే.. ఆ టైంలో చెల్లికి ఫోన్ చేస్తారా? తల్లిదండ్రులకు చేస్తారా?అన్న శోభ మాటలు చూస్తే.. హోంమంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలే గుర్తుకు రాక మానదు. ఒకవైపు తమకు జరిగిన అన్యాయంపై రోదిస్తున్న కుటుంబాలకు సాంత్వన కలిగేలా నేతలు మాట్లాడకున్నా ఫర్లేదు కానీ.. వారు మరింత వేదన చెందేలా మాట్లాడటం ఏ మాత్రం మంచిది కాదన్న చిన్న విషయాన్ని జెడ్పీ ఛైర్ పర్సన్ హోదాలో ఉన్న శోభ మిస్ కావటం ఏమనాలి? ఏమైనా. . ఇలాంటి వ్యాఖ్యలు అధికారం చేతిలో ఉన్నోళ్ల నోటి నుంచే వస్తాయేమో?