Begin typing your search above and press return to search.
జన్ ధన్ ఖాతాల్లో డబ్బులు వేయరంట
By: Tupaki Desk | 13 Dec 2016 8:37 AM GMTసామాన్యుల్లో పెద్ద ఎత్తున్న జరుగుతున్న చర్చకు బీజేపీ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. దేశ - విదేశాల్లో ఉన్న నల్లధనం వెలికి తీసిన అనంతరం పేదలకు సంబంధించిన జన్ ధన్ ఖాతాల్లో సదరు సొమ్మును డిపాజిట్ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే అలా సొమ్ములు జమచేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు - ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ - నల్లధనాన్ని వెలికితీసిన తరువాత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, తద్వారా వచ్చే ఫలాలు పేదలకు దక్కేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
పెద్దనోట్ల రద్దును ప్రజలు హర్షిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని, గతంలో నల్లధనంపై నానాయాగీ చేసిన ప్రతిపక్షాలు నేడు నోరుమెదపడం లేదని కంభంపాటి హరిబాబు మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకే పెద్దనోట్లను రద్దు చేశారన్నారు. దీనివల్ల ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ నెలాఖరు నాటికి సాధారణ స్థితి నెలకొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు కొంత మందగించినప్పటికీ రానున్నకాలంలో మరింతగా పుంజుకుంటుందని హరిబాబు జోస్యం చెప్పారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చటంలో కొందరు బ్యాంకు అధికారుల పాత్ర ఉందని - ఇప్పటికే 26 మంది అధికారులపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు చేపట్టిందన్నారు. గృహ నిర్మాణాలకు తక్కువ వడ్డీరేట్లతో రుణాలిస్తే వృద్ధిరేటు మరింత పెరిగే అవకాశముందని హరిబాబు చెప్పారు. పెద్దనోట్లు 14 లక్షల కోట్లకు పైగా ఉండగా ఇప్పటికే 11.58 లక్షల కోట్లు ఆర్ బిఐ వద్దకు చేరాయన్నారు. గత రెండేళ్లుగా నల్లధనంపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు నేడు పార్లమెంట్ లో ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. నగదు రహిత లావాదేవీలు జరపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని హరిబాబు అన్నారు. కేంద్రం బంగారంపై అమలు చేస్తున్న నిబంధనలు కొత్తవేమీ కావన్నారు. రానున్న రెండున్నరేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్యాకేజీలో ఉన్న అన్ని ప్రాజెక్టులు వస్తాయని భరోసా ఇచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/