Begin typing your search above and press return to search.
జగన్ ను తప్పుపట్టే హక్కు భాజపాకుందా?
By: Tupaki Desk | 15 Feb 2018 3:30 PM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం అనేది దాదాపుగా అన్ని పార్టీలు అందరు ఉద్యమకారులు చాలా ‘కన్వీనియెంట్’గా విస్మరించిన సంగతి. ఏపీ విపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఈ అజెండా ను పట్టుకుని మడమతిప్పకుండా ముందుకు సాగుతున్నారు. ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం చేస్తున్నారా.. రాష్ట్రం కోసమే చేస్తున్నారా? అనేది వేరే సంగతి. ఇప్పటికైతే తమ పోరాటపథాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని.. బడ్జెట్ సమావేశల్లో పోరాటం సాగించి - ఫలితం లేకుంటే.. సమావేశాలు ముగిసేరోజున రాజీనామా చేయాలనేది ప్రణాళికగా వెల్లడించారు. అయితే వైకాపాకు ఎక్కడ కీర్తి వచ్చేస్తుందో అనే భయంతో.. ఈ పోరాటంపై బురద చల్లడానికి తెదేపా శ్రేణులు ఆరాటపడడంలో అర్థముంది. అయితే భాజపా నాయకులు కూడా దీన్ని విమర్శిస్తుండడం విస్తుగొల్పుతోంది. పైగా భాజపా రాష్ట్ర అద్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. రాజీనామాలు చేసేందుకేనా ప్రజలు గెలిపించింది.. అని వైసీపీ నిర్ణయాన్ని నిలదీస్తున్నారు.
శెబ్బాస్.. ఈ మాత్రం ప్రతిస్పందన ఉండాల్సిందే. అయితే జగన్ ను తప్పుపట్టే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి ఉన్నదా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. చాలా సింపుల్ గా చెప్పాలంటే.. ప్రజలు తమను ఎందుకు గెలిపించారో వారికి తెలుసు.. రాష్ట్రానికి మంచి జరగాలని.. తాము గెలిస్తే ప్రత్యేకహోదా కూడా సాధించుకు వస్తాం అని ప్రజలు నమ్మి ఓట్లు వేశారనే వైసీపీ భావిస్తున్నది. వారికి అధికారం దక్కి ఉండకపోవచ్చు గాక.. కానీ ప్రజలకిచ్చిన మాటకోసం హోదాకోసం పోరాటం సాగిస్తున్నది. ఆ ప్రయత్నంలో విఫలం అయినట్లయితే.. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు సిగ్గుపడి రాజీనామాలు చేసేయాలని వారు నిర్ణయించుకున్నారు. మళ్లీ ఉప ఎన్నికలు గనుక వచ్చినట్లయితే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి.. ప్రజల ప్రతి ఓటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలనే ప్రజాకాంక్షను కేంద్రానికి తెలియజెబుతుందనే సత్యాన్ని వారికి తెలియజెప్పి అప్పుడు దిక్కులు ప్రతిధ్వనించేలా కేంద్రానికి హోదాకాంక్షను తెలియజేస్తారు. అందుకోసం వారి ప్రయత్నం అని భాజపా నేతకు ఎందుకు అర్థం కావడం లేదు.
ప్రజలకు ఒక మాట ఇచ్చి ఎంచక్కా అధికారంలోకి వచ్చిన తర్వాత.. అవకాశవాదం ప్రదర్శిస్తూ, రాష్ట్రం అంటేనే చులకన భావంతో చూస్తున్న నైతిక విలువల్లేని - రాజకీయ విలువల్లేని...ప్రజల ఆకాంక్షల పట్ల గౌరవం లేని భాజపా కూడా.. వైసీపీని విమర్శించే స్థాయికి వచ్చిందా అని ప్రజలు అనుకుంటున్నారు. ముందు తమను ప్రజలు ఎందుకు గెలిపించారో వారు తెలుసుకోవాలని.. వైకాపాను విమర్శించే హక్కు తమకు లేదని గ్రహించాలని జనం హితవు చెబుతున్నారు.