Begin typing your search above and press return to search.

టీడీపీ వాటిని తమతో షేర్‌ చేసుకోవాలన్న బీజేపీ!

By:  Tupaki Desk   |   9 April 2015 5:37 AM GMT
టీడీపీ వాటిని తమతో షేర్‌ చేసుకోవాలన్న బీజేపీ!
X
కమలనాథుల కన్ను నామినేటెడ్‌ పోస్టుల మీద పడింది! ఆ పోస్టుల భర్తీలో తమకు వాటా కావాలని వారు అడుగుతున్నారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తమ పార్టీ మీటింగ్‌లో కాస్త గట్టిగానే మాట్లాడాడు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంపై కామెంట్లుచేశాడు. వాటి విషయంలో భారతీయ జనతా పార్టీకి కూడా హక్కులు ఉంటాయని స్పష్టం చేశాడు.

ఈ మేరకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కూడా బహిరంగంగానే విజ్ఞప్తి కమ్‌ సూచన చేశాడు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంలో భారతీయ జనతా పార్టీని, ఆ పార్టీ కార్యకర్తలనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశాడు. నామినేటెడ్‌ పోస్టులు మనకెందుకు దక్కవో చూద్దామని పార్టీ శ్రేణుల వద్ద వ్యాఖ్యానించాడు.

టీడీపీ మహానాడులో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయం గురించి చర్చ జరిగే అవకాశం ఉందని.. ఆ పార్టీ నేతలు కార్యకర్తలు కలిసి అన్నింటినీ తమ వారికే పంచుకొనే ప్రయత్నం చేయవచ్చని.. అయితే ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ఎదురించాలని పార్టీ నేతలు హరిబాబుకు సూచించారు.

వెనక్కుతగ్గవద్దని.. ప్రతి కమిటీలో కూడా భారతీయ జనతా పార్టీకి కనీసం రెండు పదవులు దక్కాలని.. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి అని తెలుగుదేశం అధ్యక్షుడికి గుర్తు చేయాలని పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.

ఈ విషయంపై స్పందిస్తూ నామినేటెడ్‌ పదవుల విషయంలో కచ్చితంగా మనకు ప్రాధాన్యత ఉంటుందని హరిబాబు వ్యాఖ్యానించి వారిలో స్థైర్యం నింపడానికి ప్రయత్నించాడు.

మరి ఇప్పటి వరకూ తెలుగుదేశం అధినేత నామినేటెడ్‌ పోస్టుల భర్తీ వ్యవహారంపై ఏమీ తేల్చడం లేదు. అయితే బీజేపీ వాళ్లు తమకూ వాటా అంటున్నారు. మరి వీరి ఆశలు నెరవేరేనా?!