Begin typing your search above and press return to search.

ప్రెస్ మీట్ రియాక్ష‌న్ః ప‌వ‌న్ ది రాజకీయం

By:  Tupaki Desk   |   27 Jan 2017 9:44 AM GMT
ప్రెస్ మీట్ రియాక్ష‌న్ః ప‌వ‌న్ ది రాజకీయం
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా - విశాఖ‌లో కొవ్వొత్తుల ర్యాలీని అడ్డుకోవ‌డంపై విలేక‌రుల స‌మావేశంలో సంద‌ర్భంగా బీజేపీ - టీడీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఇరు పార్టీల నేత‌లు అదే రీతిలో రియాక్ట‌య్యారు. బీజేపీ నేత‌ - రాష్ట్ర మంత్రి కామినేని శ్రీ‌నివాస్ జ‌న‌సేన అధిప‌తిపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర‌మంత్రి వెంకయ్యనాయుడు మాటమార్చారని త‌న స్వర్ణ భారతి ట్రస్ట్ పై చూపుతున్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై - ప్రజా సమస్యలపై పెడితే బాగుంటుందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొనడాన్ని కామినేని త‌ప్పుప‌ట్టారు. స్వర్ణ భారతి ట్రస్టు విషయంలో వెంకయ్యపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను కామినేని ఖండించారు. పవన్ కల్యాణ్ ప్రతిదానినీ రాజకీయ కోణంలోనే చూస్తున్నారన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ లో దాదాపు 20 వేల మంది ఉపాధి పొందుతున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. వెంకయ్యనాయుడు స్వర్ణభారతి ట్రస్ట్ ను తన కుటుంబం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారన్నారు. దీంతో పాటుగా ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయం చేయడం తగదని మంత్రి కామినేని శ్రీనివాస్ ప‌వ‌న్ ను కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం సాయం అవసరమని, హోదాతో సమానమైన, అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు రాష్ట్రానికి ప్యాకేజీ వల్ల సమకూరుతాయని కామినేని వివ‌రించారు.

ఇదిలాఉండ‌గా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు స్పందించారు. ప‌వ‌న్ అభిప్రాయాలు నిజ‌మైన‌వే అయిన‌ప్ప‌టికీ వాటిని వ్య‌క్తీక‌రించిన తీరు స‌రికాద‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా కోసం పెద్ద ఎత్తున కృషిచేశార‌ని వివ‌రించారు. కేంద్రం నో చెప్ప‌డంతోనే ప్యాకేజీతో అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నార‌ని వివ‌రించారు. కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రిని బ్యాంకు రుణాల ఎగ‌వేతదారుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శించ‌డాన్ని బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌ప్పుప‌ట్టారు. సుజ‌నా చౌద‌రి అలా చేయ‌లేద‌ని వ్యాఖ్యానించారు. అయితే విశాఖ ఆర్కే బీచ్ ను పందుల పోటీల‌కు వేదిక‌గా ఉప‌యోగించాల్సింది అనే సుజ‌నా వ్యాఖ్య‌లు స‌రికాద‌ని ఉమా అంగీక‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/