Begin typing your search above and press return to search.

లవ్ ఫెస్టివల్ తో బ్రేకప్? ఆర్ బ్యాకప్?

By:  Tupaki Desk   |   4 Nov 2016 7:59 AM GMT
లవ్ ఫెస్టివల్ తో బ్రేకప్? ఆర్ బ్యాకప్?
X
తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో చంద్రబాబు ప్రభుత్వ తన ఆలోచనలను విరమించుకున్నట్లుగా కనిపిస్తోంది. లవర్సు డే సందర్బంగా ఫిబ్రవరి 14న విశాఖలో లవ్ ఫెస్టివల్ నిర్వహించాలన్న ఆలోచన నుంచి వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు బీచ్ లో ఫెస్టివల్ నిర్వహించాలని.. పాప్ గాయని షకీరాను పిలవాలని.. ప్రపంచవ్యాప్తంగా 9 వేల ప్రేమ జంటలు పాల్గొనే చేయాలని.. బీరు - బికినీ... ఒకటేంటి అన్నీ ఉంటాయనుకున్న ఉత్సవం నుంచి వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. లవ్ ఫెస్టివల్ గురించి విషయం బయటకు పొక్కగానే విపక్ష వైసీపీ నేతలు విరుచుకుపడగా.... మిత్రపక్షం బీజేపీ నేత - విశాఖలో ఎమ్మెల్యే విష్ణువర్ధన రాజు కూడా ఫైరయ్యారు. దీంతో చంద్రబాబు గవర్నమెంటు ఈ నీచ ప్రణాళిక నుంచి డ్రాప్ అయినట్లు సమాచారం. మంత్రి - బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ చెబుతున్న మాటలు అందుకు ఊతమిస్తున్నాయి.

వైజాగ్ లవ్ ఫెస్టివల్‌ కు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు సహా మంత్రులెవరూ లవ్‌ ఫెస్టివల్‌ కు హాజరవడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు అర్థమవుతోంది. అయితే... పనిలోపనిగా మంత్రిగారు వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ ఊహాత్మక ఆరోపణలే అని మండిపడ్డారు. లవ్ ఫెస్టివల్ నెపాన్ని గోవాకు చెందిన సంస్థపై నెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఫెస్టివల్ నిర్వహణకు అనుమతి కోరుతూ చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులు విశాఖ కార్పొరేషన్ కు, పర్యాటక శాఖకు దరఖాస్తు చేశారని చెప్పారు. ఆ ఫెస్టివల్ మన సంస్కృతికి విరుద్ధమని తేలితే అనుమతి ఇవ్వబోమని తెలిపారు.

మంత్రిగారి మాటలను బట్టి ప్రభుత్వం దీన్ని నిర్వహించబోదని.. అందులో ఇన్వాల్వు కాదని అర్థమవుతోంది. అయితే.. ఫెస్టివల్ ఉండదని మాత్రం ఆయన చెప్పలేదు. కామినేని చెబుతున్నట్లు గోవా సంస్థే దీనికోసం అనుమతులు కోరినా కూడా దాని వెనుక ఉన్నది ప్రభుత్వమేనని తొలుత వినిపించింది. రాజధాని అమరావతిని సింగపూర్ సంస్థలు నిర్మించినా.. నిర్మింపజేసేది రాష్ట్ర ప్రభుత్వమే కదా.. అలాగే పర్యాటకంపై భారీగా ఆదాయం పెంచుకోవాలని చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం గోవా సంస్థను అడ్డంపెట్టుకుని ఈ కామోత్సవం నిర్వహించాలనుకుంటోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కామినేని చెబుతున్నట్లు సీఎం - మంత్రులు అటెండ్ కాకపోయినా దీని వెనుక ఉన్నది ప్రభుత్వమేనని వారు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/