Begin typing your search above and press return to search.
నేను ''కామి''నేనిని కాను...
By: Tupaki Desk | 11 April 2015 10:45 AM GMTఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ను ఓ సమస్య తెగ చీకాకు పెట్టింది.ఎలా మొదలైందో తెలియదు కానీ హీరోయిన్ శ్రుతిహాసన్ ను ఆయన వేధించినట్లు వార్త ఒకటి వారం రోజులుగా విపరీతంగా ప్రచారంలోకొచ్చింది. ఫేస్ బుక్, వాట్స్ యాప్ లలోనే కాదు... టీవీల్లోనూ ఈ వార్త ప్రసారమైంది. కామినేని, శ్రుతి హాసన్ లు ఒకే విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మంత్రి ఫోన్ లో పెద్ద నోటితో మాట్లాడడం వల్ల శ్రుతి ఇబ్బంది పడిందన్నది వార్త తొలుత మొదలైంది... మంత్రి పెద్ద గొంతుతో మాట్లాడడం వల్ల శ్రుతి ఇబ్బంది పడిందన్నది దాని సారాంశం... అయితే... అది కాస్త క్రమంగా మంత్రి శ్రుతిని వేధించారన్నట్లుగా మారిపోయింది. కొందరు ఓ మంత్రి.. ఓ మంత్రి అని రాయగా.. ఇంకొందరు మాత్రం ఏకంగా కామినేని శ్రీనివాస్ శ్రుతి హాసన్ ను లైంగికంగా వేధించారన్న అర్థంలో రాసేశారు. దీంతో చాలామంది పెద్ద మనిషిలా కనిపించే ఆయనకు ఇదేం బుద్ధి అనుకున్నారు. ఇదంతా తెలిసిన మంత్రి ఇక లాభం లేదని మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి చ్చింది పాపం.
సినీనటి శ్రుతి హాసన్‌ను తాను ఏడిపించినట్లు వస్తున్న వార్తలను మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఖండించారు. తాను శ్రుతి హాసన్‌ను సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదని.... అలాంటిది తాను ఆమెను ఎలా ఏడిపిస్తానని కామినేని ప్రశ్నించారు. తిరుపతికి తాను ఎప్పుడు వెళ్లిన కారులో వెళ్లి వస్తానని.. ఆమె, తాను తిరుపతికి ఒకే విమానంలో వెళ్లామనడం అబద్దమని చెప్పారు. మీడియాలో కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు.