Begin typing your search above and press return to search.
జర్నలిస్టులపై మండిపడ్డ ఏపీ మంత్రి
By: Tupaki Desk | 15 Aug 2015 1:59 PM GMTమన రాజకీయ నాయకులకు ఏదైనా కాస్త కష్టమైన ప్రశ్న వేస్తే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. మంత్రులైతే తమ శాఖల్లోని లోటుపాట్లను ఎత్తిచూపితే విలేకర్ల పై ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతారు. వారి లోపాలను ఎత్తి చూపే మీడియా చెడ్డదిగాను... వారి గురించి డప్పు కొట్టే మీడియా మంచిదిగాను కనపడుతుంది. మీడియాపై రాజకీయ నాయకుల అక్కసు ఎలా ఉందో తెలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తేనే అర్థమవుతుంది.
కొద్ది రోజుల క్రితం తెలంగాణ రవాణాశాఖా మంత్రి మహేందర్ రెడ్డి మీడియా కెమేరాలు ఉండగానే ఓ విలేకరిని నీ అంతు చూస్తానంటూ బెదిరించారు. ఈ సంఘటన మరువక ముందే ఈ సారి ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ వంతు వచ్చింది. తన శాఖలోని లోపాలపై ప్రశ్నలు వేయడంతో ఆయన వారిపై ఫైర్ అయ్యారు.
ఏపీ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతుండగా వైద్య, ఆరోగ్య శాఖలోని లోపాలపై జర్నలిస్టులు ఆయనపై ప్రశ్నలు సంధించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో తడబడ్డ ఆయన ఒకానొక దశలో సహనం కోల్పోయారు.
మీ కడుపు మంట తీర్చుకునేలా తనకు ప్రశ్నలు వేయవద్దంటూ జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై మంత్రి ఫైర్ అవ్వడంతో అవాక్కైన జర్నలిస్టులు ప్రజల్లో ఉన్న భావాలనే తాము ప్రశ్నల రూపంలో సంధిస్తామని...సామాన్యుడి మదిలో ప్రభుత్వం, మంత్రులపై ఉన్న అభిప్రాయాలనే తామూ వ్యక్తం చేస్తామని వారు చెప్పారు. జర్నలిస్టులు కౌంటర్ స్టార్ట్ చేయడంతో కాస్త వెనక్కి తగ్గిన ఆయన తనకు అర్జెంట్ పని ఉందని..బెంగళూరు వెళ్లి విమానం ఎక్కాలంటూ హడావిడిగా లేచి వెళ్లిపోయారు.