Begin typing your search above and press return to search.
మంత్రి కామినేని నీరో చక్రవర్తి కంటే గొప్పోడట
By: Tupaki Desk | 3 July 2017 7:54 AM GMTఏపీలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలో మలేరియా - డెంగూలకు తోడుగా ఇప్పుడు ఆంత్రాక్స్ కూడా విరుచుకుపడుతోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంత జరుగుతుంటే ఏపీ ఆరోగ్య మంత్రి మాత్రం ఏజెన్సీలో పర్యటించకుండా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని విపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కామినేని సొంత పార్టీ బీజేపీ నేతలు కూడా ఆయన తీరుపై మండిపడుతున్నారట. కామినేని తన శాఖకు సంబంధించిన ప్రజా సంబంధమైన విషయాలు చూడకుండా చంద్రబాబు భజనలో.. చంద్రబాబు అనుకూలురుకు ప్రయోజనాలు కల్పించడంలో బిజీగా ఉంటున్నారని బీజేపీ నేతల నుంచి వినిపిస్తోంది.
ముఖ్యంగా రాష్ర్టంలో హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తితే కామినేని మాత్రం పైరవీల కోసం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ర్టంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఆయన నాలుగు సార్లు ఢిల్లీ వెళ్లారట. అయితే, ఇదంతా రాష్ర్టంలో ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడడానికేమీ కాదట. ప్రయివేటు మెడికల్ కాలేజిలకు లాభం కలిగించేలా నీట్ పరీక్షలో క్వాలిఫయింగ్ మార్కులను తగ్గించాలని కోరడానికి ఆయన ఢిల్లీ వెళ్లారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆరోగ్య శాఖలోని సీనియర్ అధికారులైతే కామినేని తీరు చూసి భయపడుతున్నారట. మంత్రిగారు తన శాఖను పట్టించుకోకుండా ఇలాంటి పనులన్నిటిలో మునిగితేలుతుంటే పరిస్థితి అదుపుతప్పి ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తుందో అని వారు ఆందోళన చెదుతున్నారట. అంతేకాదు... రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదం ఏర్పడితే ఉరుముఉరిమి మంగళం మీద పడినట్లుగా ఈ మంత్రి తప్పించుకుని తమను బలి పశువును చేస్తారేమోనని ఏజెన్సీ జిల్లాల వైద్య అధికారులంతా టెన్షన్ పడుతున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/