Begin typing your search above and press return to search.
కామినేని చూపు సైకిల్ వైపు...
By: Tupaki Desk | 13 July 2018 12:30 PM GMTబళ్లు ఓడలౌతాయ్ ఓడలు బళ్లవుతాయ్.... అయితే వాటిని నడిపేవాడు మాత్రం ఎప్పటికీ ఆయా వాహనాల డ్రైవర్లుగానే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి - బిజేపి నాయకుడు కామినేని శ్రీనివాస్ కూడా ఈ కోవలోకే వస్తారు. వెంకయ్యనాయుడు అండతో తెలగుదేశం పార్టీ మద్దత్తు తో కైకలూరు నుంచి ఎంఎల్ ఎ గా గెలిచిన కామినేని బిజేపి కోటలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. నాలుగేళ్ల తర్వాత బిజేపి - టిడిపి దాంపంత్యం బెడిసికొట్టింది.
దీంతో కామినేని శ్రీనివాస్ తన బిజేపి సహచర మంత్రి మాణిక్యాలరావుతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసారు. ప్రత్యాక హోదాతో పాటు బిజేపి - టిడిపి కత్తులు నూరుకుంటున్నాయి. ఇది ఇరుపార్టీల నాయకుల పై భౌతిక దాడుల వరకు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికక్కడ ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపైఒకరు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. రాష్ట్రామంతటా ఇదే పరిస్ధితి. అయితే ఒక్క కైకలూరు నియోజకవర్గంలో మాత్రమే ఎలాంటి ఆందోళనలు జరగడంలేదు. దీనికి కారణం కాషయ చొక్క తోడుకున్న మంత్రి కామినేని సైకిల్ వైపు చూడడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కామినేని శ్రీనివాస్ మనిషి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నా ఆయన మనసంతా తెలుగుదేశం వైపే ఉంది. తన రాజకీయ గురువు వెంకయ్య నాయుడికి పార్టీలో తీవ్ర అవమానం జరిగిందని సన్నిహితుల దగ్గర వాపోతున్న కామినేని శ్రీనివాస్ బిజేపి నాయకత్వం మధ్య ఇమడలేకపోతున్నారని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.రాష్ట్రానికి అన్యాయం జరిగింది బిజేపి వల్లే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వశిస్తున్న సమయంలో తాను ఇంకా ఆ పార్టీలో కొనసాగడం మంచిది కాదని కామినేని తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. ఇందుకే ఆయన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని అంటున్నారు.
వచ్చే ఎన్నికలలో కామినేని శ్రీనివాస్ తెలుగుదేశం తరఫున పోటి చేస్తారని అంటున్నారు. నిజానికి కైకలూరులో బిజేపికి ఏమంత పట్టు లేదు. తెలుగుదేశం ఓట్లతోనే ఆయన బిజేపి నుంచి గెలిచారు. రాష్ట్రంలో బిజేపికి గడ్డు కాలం నడుస్తున్నందున ఆయన నేరుగా తెలుగుదేశం నుంచే పోటి చేసే అవకాసాలున్నాయి.