Begin typing your search above and press return to search.
కామినేని ... ఆహా ఏమి నీ తెలివి!
By: Tupaki Desk | 3 Dec 2018 4:48 PM GMTరాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. అదేంటి ఇది సినిమాల్లో ముఖ్యమని అంటుంటారు కదా... అనుకుంటున్నారు కదా. ఇక్కడ చాలా ముఖ్యం. ఒకే నిర్ణయం తీసుకునే సమయాన్ని బట్టి విలువ మారుతుంటుంది. కరెక్టు టైంలో తీసుకునే నిర్ణయం సరైన ఫలితాలను ఇవ్వడంతో పాటు - కాస్త ఇమేజ్ ను కూడా తెచ్చిపెడుతుంది. బహుశా ఇపుడు ఏపీ రాజకీయాల్లో కామినేని శ్రీనివాస్ ను చాలా తెలివైన రాజకీయ నాయకుడిలా కనిపిస్తున్నారు. ఆయన టైమింగ్ మామూలుగా లేదు. ఆయన ఏం చేశారంటే... రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ వార్త విన్న వెంటనే అందరికీ ఏం ఆయన అలిగాడా? బీజేపీ ఆయనను ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అని అనిపిస్తుంది. సరే లోపల ఏదో ఒకటి జరిగిన మాట అయితే వాస్తవం గానీ... ఆయన నిర్ణయం మాత్రం దాని ఫలితం కాదు. కామినేని క్లారిటీ. ఎందుకో తెలుసుందాం.
ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లను గెలిచింది. బీజేపీ అంత ఓటు బ్యాంకు ఉందా అంటే సమస్యే లేదు. తెలుగుదేశం పొత్తు వల్ల గెలిచింది. అది 2014 పరిస్థితి. అయితే, చంద్రబాబు తన వైఫల్యాల కవరింగ్ కోసం ఇపుడు బీజేపీని బలిపశువులా వాడుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బీజేపీ ఒంటరి అయ్యింది. పోనీ ఏపీలో ఆ పార్టీకి సొంతంగా గెలిచే స్థానాలు ఉన్నాయా అంటే...ఒక్కటీ లేవు. పోనీ ఏదైనా పార్టీ బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉందా అంటే... టీడీపీ పోను ఏపీలో ఉన్నవి మూడు పార్టీలు. వైసీపీ - జనసేన - కాంగ్రెస్. ఇప్పటికే వైసీపీ కి దగ్గర కావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తే...మేము ఎవరితో పొత్తులకు సిద్ధంగా లేం అని జగన్ తిరస్కరించారు. కాంగ్రెస్ తో వారికి పొసగదు. ఇక ఉన్నది జనసేన. ఆయన ఏకంగా నేనే 2019లో సీఎం అంటున్నాడు. పవన్ పరిస్థితి బీజేపీ పరిస్థితి ఆల్ మోస్ట్ సేమ్. కాబట్టి కుదిరితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరొచ్చు. కానీ ప్రత్యేక హోదా కారణంగా బీజేపీతో పొత్తు వల్ల పవన్ మునిగిపోతాడు కాబట్టి అతను కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది. అంటే బీజేపీకి ప్రస్తుత వాతావరణం అనుకూలంగా లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున పోటీ చేయడం అంటే... ప్రచారం ఖర్చు - డిపాజిట్ సొమ్ము వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం మినహా మరేమీ కాదు.
మరి ఇలాంటి దారుణ పరిస్థితుల్లో కామినేని తీసుకున్న నిర్ణయం తెలివైనదే కదా. పోటీ చేయడం ఎందుకు, పోగొట్టుకోవడం ఎందుకు? ఇంకో విషయం ఏంటంటే.. కామినేని ఏపీలో చంద్రబాబును తిట్టని ఏకైక బీజేపీ నేత. టీడీపీలో చేరతారని ప్రచారం జరిగినా ఆ విషయాన్ని ఆయన ఈరోజు కొట్టిపారేశారు. నేను బీజేపీలోనే ఉంటాను. కానీ ఎన్నికల్లో పోటీ చేయను అంటున్నారు. గుడ్ టైమింగ్ కామినేని గారు... గుడ్ లక్!