Begin typing your search above and press return to search.
మంత్రి ఆర్డర్... ప్రశ్నిస్తే లోపలేసేయండి
By: Tupaki Desk | 4 Jan 2017 10:05 AM GMTరాష్ట్ర వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యవహారశైలి వివాదాస్పందంగా మారింది. ప్రజల వద్దకు వెళ్లిన సందర్భంగా తనను నిలదీసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి... ప్రశ్నించే వారిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. కదిలిండి మండలం మూలలంకలో పంచాయతీ కార్యాలయం వద్ద జన్మభూమి-మాఊరు గ్రామసభలో ఈ పరిణామం జరిగింది. మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతుండగా గ్రామస్తుడు విజయబాబు పెద్దనోట్ల రద్దు-కరెన్సీ కొరత - బ్యాంకులు-ఏటీఎంల వద్ద ఇబ్బందులు ప్రస్తావించారు. నగదు సరిపడా లేకపోవడంతో రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నామని, మీరేం చేస్తున్నారని మంత్రి కామినేనిని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన మంత్రి "సంబంధం లేని విషయం మాట్లాడతావా?అతన్ని అరెస్టు చేయండి" అంటూ పోలీసులను ఆదేశించారు
మంత్రి ఆదేశాలతో షాక్ కు గురైన గ్రామస్తులు కర్రె సూర్యనారాయణ - మహదేవ సాయి - దారా రాంబాబులు అందరి సమస్యలను ప్రస్తావిస్తే అరెస్టు చేయడం అన్యాయమని అడ్డు తగిలారు. దీంతో మరింత కోపోద్రిక్తుడైన మంత్రి కామినేని శ్రీనివాస్ "ఎవరు మాట్లాడినా వారిని లోనపడేయండి" అని అధికారులను ఆదేశించడంతో ముగ్గురు గ్రామస్తులను సైతం అరెస్టు చేశారు. ఎంపీపీ బండి లక్ష్మి స్వగ్రామంలోనే ఈ ఉదంతం జరగడం గమనార్హం. అనంతరం గ్రామస్తులు తీవ్ర నిరసన తెలపడంతో వారిని విడిచిపెట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/