Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరూ....కమ్మగా ముంచేస్తున్నారా... ?
By: Tupaki Desk | 7 Dec 2021 4:30 PM GMTకమ్మ సామాజికవర్గం ఏపీ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆ విషయంలో రెండవ మాటకు తావు లేదు. కాంగ్రెస్ అప్రతిహతంగా వెలిగిపోతున్న కాలంలో ఆ పార్టీ దూకుడుకు బ్రేకులు వేసి తెలుగుదేశాన్ని ఏర్పాటు చేయడం వెనక ఎన్టీయార్ ఉంటే ఆయన వెనక బలమైన సక్తిగా కమ్మలు ఉన్నారు అన్నది నిజం. కమ్మలకు బ్రహ్మాండమైన రాజకీయ వేదికగా టీడీపీని మార్చుకున్నారు. అదే సమయంలో నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి ఏపీతో పాటు దేశ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపిస్తూ వస్తున్నారు.
అటువంటి కమ్మ కులాన్ని టచ్ చేసి చూస్తే ఏమవుతుందో చూపిస్తామనే అంటున్నారు. ఏపీలో ఇపుడు బాహాటంగా కుల సంకుల సమరం సాగుతోంది అని చెప్పాలి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక పద్ధతి ప్రకారం కమ్మల మీద దాడులు జరుగుతున్నాయని వారు అనుమానిస్తున్నారు. ముందు రాజకీయానికి దెబ్బ కొట్టారు, ఆ తరువాత వారి వ్యాపారాలతో పాటు అస్థిత్వం మీద కూడా దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోంది అని వారు మధనపడుతున్నారు.
నిజానికి ఎన్టీయార్ వచ్చాక కమ్మ కులంలో ఐక్యత వచ్చింది అని అంతా అనుకుంటారు. అయితే ఎంతలా వారు టీడీపీని ఆదరించినా దాని రాజకీయ విధానాలను వ్యతిరేకించే వారు కూడా ఎక్కువగానే నాడు ఉండేవారు. వారు ఇతర పార్టీలలో చురుకుగా ఉండేవారు. అలాగే మొత్తానికి మొత్తం సామాజిక వర్గం ఒకే పార్టీకి అన్నట్లుగా సీన్ ఎపుడూ లేదు. అయితే రెండున్నరేళ్ల వైసీపీ ఏలుబడిలో మాత్రం ఈ అనూహ్య ఐక్యతను సాధించారని అంటున్నారు. కావాలని తమను వైసీపీ పెద్దలు టార్గెట్ చేస్తున్నారు అన్న మండిపాటుతో కమ్మలంతా గతానికి భిన్నంగా ఒక్కటి అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏ చిన్న విషయం అయినా వారు సీరియస్ గానే తీసుకుంటున్నారు.
దాంతో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని వారు భావిస్తున్నారు. దీనికంతటికీ కారణం ఏంటి అంటే ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుని టార్గెట్ చేయడం. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకులను ముందు పెట్టి మొత్తం సినిమా నడిపిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. వారు ఎవరో కాదు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ ఇద్దరూ కూడా డైరెక్ట్ గా చంద్రబాబునే టార్గెట్ చేశారు.
ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ హద్దులు ఏనాడో దాటేశారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. అది ఎంతదాకా వచ్చింది అంటే చంద్రబాబు లాంటి ఉక్కు మనిషి వెక్కి వెక్కి ఏడ్చేటంత. దాంతో ఆ సామాజిక వర్గం ఇక చేతులు ముడుచుకుని కూర్చోకూడదు అన్న నిర్ణయానికి వచ్చేసింది అంటున్నారు. ఈసారి తమ రాజకీయాన్ని, ఐక్యతను గట్టిగా చూపించాల్సిందే అన్న దాంట్లో రెండవ మాటకు తావు లేదు అంటున్నారు.
ఇక ఏపీలో సామాజికంగా కూడా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అదెలా అంటే ఒకనాడు కోస్తా జిల్లాలలో కమ్మలకు కాపులకు పడేది కాదు, అయితే ఇపుడు పరిస్థితిలో మార్పు వస్తోంది. కమ్మలకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వారు చెప్పడంతో వారిలో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. రెండు బలమైన ఈ సామాజిక వర్గాలు కలిస్తే కోస్తాతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాల్లో టీడీపీ దుమ్ము దులపడం ఖాయమనే భావన ఉంది. ఇది రాజకీయ సమీకరణ అయితే దాని కంటే ముందు సామాజికంగా కూడా కమ్మలు మరింత ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్నారు.
ఆట మీరు మొదలెట్టారు, మేము దాని అసలు రుచి చూపిస్తామని అంటున్నట్లుగా కమ్మలలో కనిపిస్తున్న ఈ దూకుడుకు అసలు కారణం వైసీపీ అనుసరించిన దుర్విధానాలే అంటున్నారు. రాజకీయ విమర్శలను దాటేసి చంద్రబాబుని టార్గెట్ చేసి మానసికంగా ఆయన కృంగిపోవడానికి కారణమైన ఇద్దరు కమ్మ సామాజికవర్గం నేతల వెనక జగన్ ఉన్నారన్న ప్రచారమే ఇపుడు వైసీపీ కొంప ముంచేలా కనిపిస్తోంది. ఇప్పటికైనా వైసీపీ ఈ రకమైన కులం కంపు రాజకీయాల నుంచి దూరం జరగడమే కాదు, ఆ ఇద్దరు నాయకులను కూడా నమ్మి ముందుకు సాగకుండా ఉంటేనే 2024 ఎన్నికల్లో ఆశలు ఉంటాయని హితైషులు సూచిస్తున్నారు. మరి వైసీపీ పెద్దల చెవికి ఈ మాటలు వినిపిస్తాయా.