Begin typing your search above and press return to search.

జగన్ ప్రభుత్వంలో కమ్మ లాబీ.!?

By:  Tupaki Desk   |   4 July 2019 4:19 AM GMT
జగన్ ప్రభుత్వంలో కమ్మ లాబీ.!?
X
గడిచిన టీడీపీ ప్రభుత్వం. అంతా ‘కమ్మ’ల మయం. చంద్రబాబు స్వయంగా కమ్మ సామాజికవర్గం వ్యక్తి కావడంతో ఆయన వర్గం వారే మంత్రులుగా.. అధికారులుగా.. వివిధ కీలక పదవుల్లో పెత్తనం చెలాయించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. రెడ్డి సామాజికవర్గ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. అధికారం రుచిమరిగిన ‘కమ్మ’ పారిశ్రామికవేత్తలు - నాయకులు - అధికారులకు ఏ పనులు జరగడం లేదని గగ్గోలు పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. జగన్ స్టిక్ట్ గా ఉండడంతో వీరంతా విలవిలలాడిపోతున్నారట.. అందుకే ఓ మాంచి ఉపాయాన్ని ఆలోచించి జగన్ ప్రభుత్వంలోకి ఎంటర్ కాబోతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన కమ్మ సామాజికవర్గ పారిశ్రామికవేత్తలు ఇప్పుడు జగన్ ఉనికినే సహించడం లేదట.. అందుకే ఎలాగైనా ప్రభుత్వంలో చేరి పనులు చేసుకోవాలని.. లబ్ధి పొందాలని యోచిస్తూ మాస్టర్ స్కెచ్ గీశారట.. అందుకోసం తమకు సన్నిహితులైన కీలక రెడ్డి సామాజికవర్గ వ్యక్తులను - నేతలను వాడుకోవాలని డిసైడ్ అయినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ కోవలోనే వైసీపీలో ఉండే పెద్దల దగ్గరికి కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు మెల్లగా తమ అనుయాయులైన రెడ్లను పంపి వారికి దరికి చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. కమ్మ సామాజికవర్గ పారిశ్రామికవేత్తలు డైరెక్ట్ గా వెళితే పనులు జరగవని వాళ్ల దగ్గర ఉన్న రెడ్డి వాళ్లను పంపుతున్నారట.. తర్వాత మెల్లిగా వీళ్లు ప్రవేశించి జగన్ ప్రభుత్వంలో పనులు చేసుకోవాలని.. లాబీయింగ్ చేయాలని స్కెచ్ గీశారట. అలా రెడ్డిలను ముందు పంపి .. తర్వాత కమ్మవాళ్లు ఎంటర్ కావడానికి ప్లాన్ సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి జగన్ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.