Begin typing your search above and press return to search.

కమ్మ వర్సెస్ కురుబ : న్యూడ్ వీడియోకు కులం రంగు...?

By:  Tupaki Desk   |   9 Aug 2022 9:30 AM GMT
కమ్మ వర్సెస్ కురుబ :  న్యూడ్ వీడియోకు కులం రంగు...?
X
ఏపీ అంటేనే కులాల సంక్షోభం. అది ఒక సంకుల సమరం. ఎన్నికల వేళ కులాలు గట్టిగానే లేస్తాయి. కానీ మిగిలిన టైమ్ లో మాత్రం సైలెంట్ గా ఎవరి పని వారు చేసుకుంటారు. అయితే ఇపుడు చూస్తే రాజకీయం అయిదేళ్ళూ కూడా వాడిగానే వేడిగానే ఉంటోంది. దాంతో కులాల కుంపట్లూ రాజేసేవారూ తయారవుతున్నారు.

విషయానికి వస్తే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పేరు మీద ఒక న్యూడ్ వీడియో అంటూ బయటకు వచ్చి కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇది విపక్షాలకు మరీ ముఖ్యంగా టీడీపీకి ఆయుధంగా మారింది. అయితే ఈ వీడియ మార్ఫింగ్ చేశారని, తనది కాదని ఎంపీ గోరంట్ల చెప్పుకున్నారు. తాను జిమ్ లో వ్యాయాం చేస్తూండగా తీసిన ఒక వీడియోను తగిలించి తమాషా చూస్తున్నారని కూడా అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి అయ్యన్న కుమారుడు చింతకాయల విజయ్ తో పాటు, మరి కొందరు పేర్లు కూడా ఈ కుట్ర వెనక ఉందని బయటపెట్టారు. వారిలో పొన్నూరి వంశీ, శివకృష్ణ చౌదరి పేర్లను కూడా ఆయన చెబుతూ టీడీపీతో సంబంధాలున్న వారందరూ రాజకీయ కుట్రకు పాల్పడ్డారని అన్నారు. దీంతో ఇపుడు కమ్మ వారి నుంచి అతి పెద్ద నిరసన వ్యక్తం అవుతోంది. మా మీద ఎంపీ ఇలా ఆరోపణలు చేస్తారా అంటూ ఎంపీ నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆందోళను చేస్తున్నారు. అలాగే కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు అయితే చెప్పులతో ఎంపీ ఫ్లెక్సీలను కూడా కొట్టడం జరిగింది.

అదే టైం లో ఎంపీకి మద్దతుగా అనంతపురం, కర్నూల్ నుంచి కురుబ సామాజికవర్గం నేతలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని అవతల పక్షానికి వ్యతిరకంగా నినాదాలు చేశారు. తమ ఎంపీ ప్రతిష్టను దిగజార్చడానికే ఇదంతా టీడీపీ చేయిస్తోందని కూడా అంటున్నారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి గెలిచే వీలున్న బలమైన రాజకీయ నాయకుల ఇమేజ్ ని దెబ్బ తీసేందుకు టీడీపీ నేత నారా లోకేష్ కొంతమంది ఎన్నారైలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఇందుకోసం 150 కోట్లు చేతులు మారాయని అంటున్నారు. అందువల్లనే తమ ఎంపీని దెబ్బతీయడానికి మార్ఫింగ్ చేసిన వీడియోలను వదిలారని చెబుతున్నారు. అవతల పక్కన ఎవరూ లేకపోయినా ఒక మహిళ ఉందని చెబుతూ రచ్చ చేశారని, వారు చెప్పిన మహిళ కూడా తన మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. ఇదంతా ఒక పధకం ప్రకారం జరుగుతోదని కురుబ సామాజికవర్గం పెద్దలు అంటున్నారు.

అయితే ఏపీలో అసలే కులాల కుంపట్లు రగులుతున్నాయి. ఉప్పూ నిప్పులా వ్యవహారం ఉంది. ఈ నేపధ్యంలో సీమ జిల్లాలలో బలంగా ఉన్న కురుబలు వర్సెస్ కమ్మలు అన్నట్లుగా రాజకీయం మారితే ఇంకా ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. అయితే గోరంట్ల మాధవ్ విషయంలో ప్రభుత్వం చర్యలు ఇంకా తీసుకోలేదు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన మీదట అక్కడ కనుక నిజమని తేలితే చర్యలు ఉంటాయని వైసీపీ పెద్దలు చెబుతున్నారు. అయితే ఇపుడు ఇది రాజకీయం దాటి కులాల సమస్యగా మారుతోంది.

మా ఎంపీ కుట్రలో పాల్గొన్న కొందరి మీద ఆరోపణలు చేస్తే కమ్మలు మొత్తం తమ మీదనే ఈ ఆరోపణలు అని భావించడం ఏంటి అని కూడా ఎంపీ మద్దతుదారులు అంటున్నారు. మొత్తానికి ఇపుడు ఈ న్యూడ్ వీడియో కులం రంగు పులుముకుంది. మరి ఇది ఏ వైపునకు టర్న్ తీసుకుంటుందో చూడాలి.