Begin typing your search above and press return to search.
కంచె ఐలయ్యగారు మళ్లీ వాయించేశారు
By: Tupaki Desk | 26 Nov 2016 6:21 AM GMTసామాజిక ఉద్యమ నేత ప్రొఫెసర్ కంచె ఐలయ్య పాత నోట్ల రద్దు విషయంలో తనదైన శైలిలో స్పందించారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీ మాతృక అయిన ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహంలో భాగమేనని ఆయన ఆరోపించారు. 'నల్లధనం-ప్రభుత్వ వ్యూహం-ఫలితం' అనే అంశంపై బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన చర్చాగోష్టి సందర్భంగా కంచె ఐలయ్య మాట్లాడుతూ...దేశంలోని అన్ని నోట్లను రద్దుచేసి బ్యాంకు ద్వారానే లావాదేవీలు జరిగేలా చూడాలని ఆర్‌ఎస్‌ఎస్ భావించిందన్నారు. కొనుగోళ్లు ఎట్టి పరిస్థితిలోనూ నోట్ల ద్వారా జరగొద్దని ఆర్‌ఎస్‌ఎస్ విద్యా విధాన్ వింగ్ వ్యూహమన్నారు. పాతనోట్ల రద్దు విషయంలో చర్చ ఆర్‌ఎస్‌ఎస్ చుట్టూ తిరిగితే బాగుంటుందన్నారు.
86 శాతం చెలామణిలో ఉన్న పాత నోట్లను రద్దు చేస్తే ఈ వ్యవస్థ ఎలా నడుస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని కంచె ఐలయ్య ప్రశ్నించారు. బ్లాక్ మనీ మొత్తం రూ.500, రూ.వెయ్యి నోట్లలోనే ఉందా?అని నిలదీశారు. నోట్లరద్దుతో ధనికులెవ్వరూ ఇబ్బంది పడట్లేదని, పేదలపైనే ఆ ప్రభావం ఉందని కంచె ఐలయ్య అన్నారు. మనదేశంలో ప్లాస్టిక్ కరెన్సీ వినియోగం పెరగాలంటే ప్రభుత్వం అందుకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం లేకుంటే దేశ రక్షణ, పేదల ఆకలికేకలు వంటి అనేక అంశాల పై చర్చ జరిగేదని ఆయన జోస్యం చెప్పారు. దీన్ని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందన్నారు. నిజంగా బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్విస్ బ్యాంకులో బ్లాక్ మనీ దాచిన 663 మందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఐలయ్య తప్పుపట్టారు.
మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నల్లధనం, ఉగ్రవాదం పేరుతో రూ.వెయ్యి, 500నోట్లను రద్దు చేసి పేదప్రజలపై యుద్ధం ప్రకటించిందని ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్ అంటే పేదలను ఇబ్బందులకు గురిచేయడం కాదని, దేశంలోని నల్లధన కుబేరులను బయటికి తీసుకురాలని అన్నారు. దేశంలో మొత్తం 57మంది నల్లధన కుబేరులున్నా వారిని బయట పెట్టకుండా 98శాతం పేదలను దిక్కుతోచని పరిస్థితిలో పడేశారని మండిపడ్డారు. ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లుకు నిప్పుపెట్టినట్టు చేశారని సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నోట్ల రద్దు నిర్ణయం మొదలే లీకై పెద్దలు జాగ్రత్త పడ్డారని చెప్పారు. ఏ ఒక్క ధనికుడు బ్యాంకుల ముందు, ఏటిఎంల ఎదుట కనిపించడం లేదని, వారికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్ల కుబేరులు రూ. 85వేల కోట్లు బ్యాంకు రుణం ఎగ్గొట్టినా పట్టించుకోవడం లేదన్నారు. పేద ప్రజల కోసం సేవ చేస్తున్నమంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రధాని మోడీ దేశంలోని కార్పోరెట్ శక్తులు, నల్లధన కుబేరుల ఏజెంట్ అని సీతారాములు ఆరోపించారు. పెద్దనోట్ల రద్దుతో కేంద్రం పేదలకు కష్టాలు తెచ్చిపెట్టినందున ప్రజల ఇబ్బందులను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 28న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.