Begin typing your search above and press return to search.

అమరావతి నెం.1 అంటున్న తెలంగాణ మేధావి

By:  Tupaki Desk   |   4 Nov 2015 5:30 PM GMT
అమరావతి  నెం.1 అంటున్న తెలంగాణ మేధావి
X
అక్కడ ఒక్క నిలువు రాయి కూడా ఇంకా కట్టలేదు. ఒక ఇటుకను కూడా పునాదిలో పరచలేదు. ఒక భవంతి కూడా నిర్మాణమవుతున్న సూచనలు కనిపించడం లేదు. అయినా అమరావతి అభివృద్దికి కేంద్రంగా నిలవనుందన్న అబిప్రాయం సీమాంధ్ర నుంచి కాదు.. తెలంగాణ నుంచి రావటం విశేషం. తెలంగాణ ప్రభుత్వంపై, కేసీఆర్ నియంతృత్వంపై యుద్ధం ప్రకటించి మరీ ధిక్కరిస్తున్న ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆశ్చర్యకరంగా అమరావతికి ఓటేశారు. హైదరాబాద్‌ను మించి పోయే సామర్థ్యం సీమాంధ్ర రాజధానికి ఉందని ప్రశంసించారు. అలా వృద్ది చెందే అమరావతి ఖచ్చితంగా హైదరాబాదుకు దీటుగా ఉంటుందని ఆయన అంటున్నారు.

కేసీఆర్ పాలనలో నిండా మునిగిపోయిన తెలంగాణ ప్రజలు ఇప్పటికిప్పుడు రెఫరెండం నిర్వహిస్తే 70 శాతం మంది తెలంగాణ వాసులు మళ్లీ సమైక్యాంద్రకే ఓటు వేస్తారని కంచె ఐలయ్య సంచలన ప్రకటన చేశారు. గతంలో విభజనను వ్యతిరేకించిన ఏపీ ప్రజలు ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నారని, అందుకే వారు తెలుగు రాష్ట్లాల విభజనను వారు వ్యతిరేకిస్తారని ఐలయ్య అభిప్రాయం వెలిబుచ్చారు. నిజానికి ఇది కొంచెం వివాదాస్పద ప్రకటనే. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులకు తెలంగాణను ఏవిధంగా కాపాడుకోవాలనేదే ఓ సవాల్‌గా మారిందన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం వారివద్దకు వెళ్లి మాట్లాడలేని స్థితిలో పాలకులు ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఐలయ్య ఆగ్రహానికి - అసంతృప్తికి - ఆవేదనకు మూలం కేసీఆర్‌ను వ్యతిరేకించటం అనే టార్గెట్‌ లో దాగుంది. అందుకే తెలంగాణలో కేసీఆర్ పెంచిపోషిస్తున్న ఫ్యూడలిజమే ఆయనకు కనబడుతోంది కాని ఏపీలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు ఆయన కంటికి ఆనినట్లు లేదు. ఏదేమైనా కేసీఆర్‌ పై బద్దవ్యతిరేకతను ఇలా ఆంధ్రప్రదేశ్‌ పై అనుకూలతగా ఆయన మార్చుకున్నారేమో. ఒకవేళ అమరావతి నగరం ఇప్పుడిప్పడే బీజం పడుతున్న దశలో పూర్తిస్థాయిలో నిర్మాణం అయ్యేసరికి ఖచ్చితంగా హైదరాబాదు తలదన్నేలా తయారవుతుందనడంలో సందేహం లేదని పలువురు అంగీకరిస్తున్నారు.