Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఇంటి వాస్తు బాగాలేనందుకే రైతుల ఆత్మహత్యలు
By: Tupaki Desk | 5 Nov 2017 10:52 AM GMTసామాజిక స్మగ్లర్లు పేరుతో పుస్తకం రాసి కలకలం సృష్టించిన రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆ తదుపరి ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బలంగా నమ్మే వాస్తు ఆధారంగానే ఆయన్ను ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని పలు సంఘాల వేదికగా ఏర్పాటైన `టీ మాస్` నిర్వహించిన సభలో కంచ ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణాన్ని తప్పుపట్టారు.
ప్రస్తుత సెక్రటరియట్ లో 1956 నుండి ఇప్పటి వరకు అనేక మంది సీఎంలు పాలించారని కంచ ఐలయ్య గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23జిల్లాలు ఉన్నప్పుడు పాలించగా...ఇప్పుడేమైందని ఆయన ప్రశ్నించారు. వాస్తు బాగలేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందని ఐలయ్య నిలదీశారు. సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ పెట్టే డబ్బులను పత్తి రైతులకు ఇవ్వాలని కోరారు. కేసీఆర్ కొత్తగా కట్టించిన ప్రగతి భవన్ వాస్తు బాగాలేదని...అందుకే రైతులు చనిపోతున్నారని ఐలయ్య వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ విలాసంతమైన జీవితాన్ని గడుపుతుంటే...రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఐలయ్య ఆరోపించారు.
ఈ సందర్భంగా తన ఇంటివద్ద వేసిన పోస్టర్‌లను ఐలయ్య ప్రస్తావించారు. ఆర్య వైశ్యులు,ఆవుల కోసం పని చేసే పార్టీ వాళ్ళంతా నా మీద కుట్రలు చేస్తున్నారని..అందులో భాగంగా తమ ఇంటి దగ్గర పోస్టర్ లు వేశారని ఐలయ్య మండిపడ్డారు. ``నా మీద ఎందుకు దాడిచేస్తున్నారు దోపిడీ దారులరా ..మీరు పత్తి రైతులకు మద్దతు ధర కల్పించండి`` అని ఐలయ్య వ్యాఖ్యానించారు. నారాయణ - శ్రీ చైతన్య కళాశాలలను తెలంగాణలో పూర్తిగా మూసి వేయాలని ఐలయ్య డిమాండ్ చేశారు. హిందు మతాన్ని రక్షించుకుంటామని చెప్తున్న వారు...ఎందుకు చనిపోయే రైతులను పట్టించుకోవడం లేదని ఐలయ్య సూటిగా ప్రశ్నించారు. ``ఆ రైతులు హిందువులు కాదా? వారిని ఎందుకు ఆత్మహత్య చేసుకోకుండా కాపాడరు?పార్టీలు,పీఠాధిపతులు ముందు పత్తి రైతుల ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపాలి. నేను రేపు వరంగల్ మార్కెట్ పోతున్నాను. నాపై విమర్శలు చేసే ఓ పీఠాధిపతి కూడా అక్కడికి రావాలి` అని ఐలయ్య అన్నారు. మాల మాదిగలు కొట్టుకోకండి కలిసి పోరాడుదామని ఐలయ్య పిలుపునిచ్చారు. `ప్రతి దళితుని ఇంట్లో ఒకరు ఇంగ్లీష్ మీడియం చదవండి. అందరం అమెరికా - ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా వెళ్దాం అక్కడ ప్రధాన మంత్రులం అవుదాం.`` అని పిలుపునిచ్చారు. టీ మాస్ నుండి ఎవ్వరు ఎన్నికల్లో పోటీ చేసినా తాను మాత్రము పోటిచేయబోనని ఐలయ్య ప్రకటించారు.