Begin typing your search above and press return to search.
ఐలయ్య మాటః మోడీ నకిలీ బీసీ
By: Tupaki Desk | 10 Nov 2017 10:00 AM GMTరిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య మరోమారు సంచలన కామెంట్లు చేశారు. ఈ దఫా గతంలో వలే ఆర్యవైశ్యులనే కాకుండా...ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. మోడీ నకిలీ బీసీ అని ఆరోపించారు. భారతీయ వ్యాపార దిగ్గజం అంబానీ వలే మోడీ సైతం బనియా సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని పేర్కొంటూ...తప్పుడు సర్టిఫికేట్ తో బీసీగా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. కేరళ మోడల్ వర్సెస్ గుజరాత్ మోడల్ అనే అంశంపై హైదరాబాద్ లో నిర్వహించిన సెమినార్‌కు హాజరైన కంచ ఐలయ్య ఈ సందర్భంగా కలకలం రేకెత్తించే ఈ కామెంట్లు చేశారు.
2014 ఎన్నికలో బీజేపీ, మోడీ `గుజరాత్ మోడల్ డెవలప్ మెంట్`తో ముందుకు సాగుతా అని ప్రకటించగా...మీడియా కూడా ఈ మోడల్ బాగుంది అని ప్రచారం చేసిందని కంచ ఐలయ్య వివరించారు. అయితే మూడున్నర ఏళ్లలో ఈ మోడల్ అభివృద్ధి బాట వేసేది కాదని అందరికీ అర్థం అయిందని అన్నారు. గుజరాత్ పై జైన్ ప్రభావం ఉందని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా బనియనే అని తెలిపారు. అయితే బీసీ సర్టిఫికెట్ తీసుకున్నాడని ఆరోపించారు. నరేంద్రమోడీ - అంబానీ కూడా బనియ కావడం వల్ల పరిశ్రమలో రిజర్వేషన్లు ఇవ్వరని ఐలయ్య విశ్లేషించారు. బనియనిజం పూర్తిగా వ్యాపారం పునాదిగా వెళుతుందని - దోచుకుందాం అనేది ఆ విధానంలో కీలకమైందని ఆయన పేర్కొన్నారు.
కేరళ అభివృద్ధికి మార్గంగా నిలుస్తోందని ఐలయ్య వివరించారు. భారతదేశంలో అత్యుత్తమ ఆస్పత్రి కేరళలో ఉందని, వైద్యం బాగుంటుందని వివరించారు. క్రీస్తుశకం 600లో మొదటగా కేరళలో మసీదు కట్టారని పేర్కొంటూ అయినప్పటికీ మత కల్లోలాలు ఇప్పటి వరకు కేరళలో జరగలేదని తెలిపారు. గుజరాత్‌లో దళితులపై దాడులు జరుగుతున్నాయని అయితే కేరళలో దళితులపై దాడులు జరగలేదని అన్నారు. తెరమీదకు వచ్చినవి కూడా వ్యక్తిగత కొట్లాటలే తప్ప దళితులపై దాడులు లేవని ఐలయ్య సూత్రీకరించారు. కేరళ సీఎం పినరయి విజయన్ బీసీకి చెందిన వ్యక్తి అని ఐలయ్య వివరించారు. అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారని, ఎస్సీ, బీసీలే కమ్యూనిస్ట్ లలో ఉన్నారని అన్నారు. కేరళలో 11.33 శాతం మంది పిల్లలు ఇంటర్ వరకు చదువుతుండగా...గుజరాత్ లో డ్రాపౌట్ పిల్లలు చాలా మంది ఉన్నారని తెలిపారు. కేరళలో బీజేపీ అధికారంలోకి రావటం కోసం మత కల్లోలాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేరళ సామాజిక లిబరిజం ఉందని వివరించారు. వచ్చే ఎన్నికల నాటికి...తెలంగాణని కేరళ మోడల్ లాగా చేయాలని నాయకులను అడగాలని ఐలయ్య పిలుపునిచ్చారు.