Begin typing your search above and press return to search.
నా రాష్ఱ్టానికొచ్చి నన్నే అంటావా: కంచె ఐలయ్య
By: Tupaki Desk | 18 Sep 2017 4:52 PM GMTకంచె ఐలయ్య మేధావా? కాదా? అన్న సంగతి పక్కన పెడితే తనకు తోచింది పుస్తకాలుగా రాసి ఎవర్నో ఒకర్ని కెలకడంలో మాత్రం దిట్ట అని చెప్పాలి. తాజా వివాదానికి ముందు కూడా ఇది పలుమార్లు జరిగిన విషయమే. అయితే... తాజాగా వైశ్యులపై ఆయన రాసిన పుస్తకం రాజేసిన అగ్గి మాత్రం ఇంకా చల్లారలేదు. అది చల్లారుతుందో లేదో కానీ మధ్యమధ్యలో ఐలయ్య కూడా మంట ఆగకుండా ఏదో ఒక మాట అంటున్నారు. ఇప్పటికి జరిగింది చాలదా అన్నట్లు ఆయన తాజాగా ఎంపీ టీజీ వెంకటేశ్ పైనా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఐలయ్య పుస్తకం నేపథ్యంలో వెంకటేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోనే ఐలయ్యా ఆ మాటలు అన్నప్పటికీ కూడా అవి వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి.
‘సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు’ అంటూ తాను రాసిన పుస్తకంపై ఆర్యవైశ్యులు మండిపడుతూ, తనపై విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని ఐలయ్య ఫైరవుతున్నారు. తనను రోడ్ల మీద కాల్చి చంపొచ్చని టీజీ వెంకటేశ్ అన్నారని... బహుశా గౌరీ లంకేశ్ ను చంపినవాళ్లు టీజీ ఇంట్లోనే ఉన్నారేమో అంటూ ఐలయ్య కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.... తన సొంత రాష్ర్టం తెలంగాణలోనే తనపై అలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ప్రాంతీయ భావనలనూ అంతర్లీనంగా రేకెత్తించే ప్రయత్నం చేశారు. ‘‘నా తెలంగాణ రాష్ట్రంలో నా మీద టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలు చేశాడు. టీజీ వెంకటేశ్ వ్యాపారి కావచ్చు.. ఆయన వద్ద చాలా డబ్బు ఉండొచ్చు.. ఎంపీ కావచ్చు.. నన్ను రోడ్ల మీద కాల్చి పడేస్తా అని వ్యాఖ్యలు చేస్తాడా? నన్ను ఏం చేసినా పాపం లేదని అంటున్నాడు. గౌరీ లంకేశ్ లాంటి వారిని చంపిన టీమ్ బహుశా టీజీ వెంకటేశ్ ఇంట్లో దాక్కుని ఉంటుంది’ అని ఐలయ్య అన్నారు.
తాను రాసిన పుస్తకం సరైంది కాకపోతే నా రాష్ట్ర ప్రభుత్వం దానిపై నిషేధం విధించవచ్చని.. లేదా కోర్టు ఆర్డర్లతో పోలీసులు తనను అరెస్టు చేయొచ్చని ఆయన అన్నారు. మొత్తానికి వివాదం మెల్లమెల్లగా సమసిపోతుందన్న సమయంలో మరోసారి ఇది బిగుసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.