Begin typing your search above and press return to search.
ఐలయ్యా...జర్నలిస్టుపై ఇంత కోపమేమిటండీ?
By: Tupaki Desk | 25 Sep 2017 10:03 AM GMTకంచె ఐలయ్య... పేరు వినబడితేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. ప్రముఖ విద్యావేత్తగానే కాకుండా సామాజిక ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన ఐలయ్య... ఎక్కడ నోరు విప్పినా కలకలమే. గతంలో ఆయనకు సంబంధించిన వివాదాలే ఇందుకు నిదర్శనమని చెప్పాలి. అయితే ఏ వివాదాన్నైనా... చాలా తేలిగ్గా తీసుకునే ఐలయ్య... ఎలాగోలా ఆ సమస్యపై బయటపడుతూనే వస్తున్నారు. అది కూడా వివాదం రేగిన వెంటనే... ఐలయ్య చాలా చాకచక్యంగా వ్యవహంచేసి అతి త్వరలోనే ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారన్న వాదన కూడా లేకపోలేదు. అయితే ఐలయ్య తాజాగా రేపిన వివాదం మాత్రం అంత ఈజీగా సమసిపోయేలా కనిపించడం లేదు. ఇటీవల ఓ పుస్తకం రాసిన ఐలయ్య... అందులో ఆర్య వైశ్యులను స్మగ్లర్లుగా అభివర్ణించేశారు. ఐలయ్య తన పుస్తకంలో చేసిన ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను కలకలమే రేపాయి. ఐలయ్యపై ఆర్య వైశ్య సామాజిక వర్గాలే కాకుండా ఇతర సామాజిక వర్గాలు కూడా భగ్గుమంటున్నాయి.
ఈ వివాదానికి ఎప్పుడు తెర పడుతుందో తెలియదు గానీ... అటు ఆర్యవైశ్యులు తగ్గడం లేదు... ఇటు ఐలయ్య కూడా తగ్గడం లేదు. ఐలయ్య తమపై చేసిన వ్యాఖ్యలనే టార్గెట్ చేసుకున్న ఆర్య వైశ్యులు... ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటే... ఈ వివాదం పెద్దది కాకుండా వ్యవహరించాల్సిన ఐలయ్య మాత్రం... వివాదాన్ని మరింతగా పెంచేస్తూ తనదైన శైలిలో దూసుకెళుతున్నారన్న విమర్శ వినిపిస్తోంది. అయినా ఐలయ్య ఏం చేస్తున్నారన్న విషయానికి వస్తే... ఈ వివాదంపై తనను ప్రశ్నిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు అనుకూలంగా మాట్లాడిన వారిని మాత్రం వదిలేస్తున్న ఐలయ్య... తనకు కాస్తంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న భావన కలిగించే మీడియా ప్రతినిధులపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో సదరు మీడియా ప్రతినిధులపై ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్య వైశ్యుల వద్ద డబ్బు తీసుకుని వారికి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ముద్ర వేసేస్తున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి చోటుచేసుకుంది.
ఆ ఘటన వివరాల్లోకి వెళితే... ఈ వివాదం నేపథ్యంలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9కి ఐలయ్య ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీవీ9 సీనియర్ జర్నలిస్టు మురళీ కృష్ణ హోస్ట్ గా ప్రసారమవుతున్న *ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ* కార్యక్రమానికి హాజరైన ఐలయ్య... మురళీకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్య వైశ్యులు తనను చంపేసేందుకు యత్నిస్తున్న వైనాన్ని ఏ ఒక్క టీవీ చానెల్ కూడా ప్రసారం చేయలేదని ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న మురళీకృష్ణ... *మీపై పరకాలలో చోటుచేసుకున్న దాడిని మేం బాగానే కవర్ చేశాం. అయినా మీ పుస్తకంలో ఉన్న అనుచిత వ్యాఖ్యలే ఆ ఘటనకు దారి తీశాయి కదా* అని అన్నారట.
అంతే ఒక్కసారిగా తనదైన శైలిలో ప్రతిస్పందించిన ఐలయ్య... *మిస్టర్ మురళీ... మీరు నాకు జడ్జీ కాదు. నా న్యాయవాది కూడా కాదు. ఆర్యవైశ్యుల తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. మీరు వేసే ప్రశ్నలు చూస్తుంటే... నేను కోర్టులో ఉన్నట్టుగా ఉంది. ఇంటర్వ్యూ పేరిట నన్ను విచారించేందుకు మీరేమైనా ఆర్యవైశ్యుల వద్ద డబ్బు తీసుకున్నారా?* అని ఐలయ్య ఓ రేంజిలో ఫైరైపోయారట. ఆ తర్వాత కాస్తంత శాంతించిన ఐలయ్య... తాను రాసిన పుస్తకంలోని వ్యాఖ్యల కారణంగా ఇబ్బంది పడే వర్గాలు - వ్యక్తులు... పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. అంతేగాని... తనపై భౌతిక దాడులకు దిగడం ఎంతవరకు సమంజసమని ఐలయ్య ప్రశ్నించారు. ఈ తరహాలో సాగిన ఆ ప్రోగ్రాంలో ఐలయ్య వ్యాఖ్యలతో మురళీకృష్ణ బాగానే ఇబ్బందిపడ్డారట.