Begin typing your search above and press return to search.
అల్లు అర్జున్ నాకోసం ప్రచారం చేస్తానన్నాడు!
By: Tupaki Desk | 16 May 2022 12:30 AM GMTపుష్ప సినిమా పాన్ ఇండియా హీరోగా గుర్తింపుపొందిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరం లేదు. సినిమాల్లోనే కాకుండా.. వ్యక్తిగత జీవితంలోనూ.. ఆయన డీసెంట్ గా ఉంటారు. ఎక్కడా ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా.. ముందుకు సాగుతుంటారు. ఇప్పటి వరకు వివాదాల సుడిలో ఎందరో చిక్కుకున్నా.. అల్లు అర్జున్ మాత్రం తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సరే.. ఇప్పుడు ఆయన గురించి కాదు.. విషయం.. ఆయనకు పిల్లనిచ్చిన మామ గురించి.
ఆయనే కంచర్ల చంద్రశేఖరరెడ్డి. విద్యాసంస్థల అధినేతగా,.. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ ఎస్ నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. రాష్ట్రంలో ఆయనకు పలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం అవి విజయవంతగా కొనసాగుతు న్నాయి.ఈ క్రమంలోనే అధికార పార్టీ టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో ఈయన ఆ పార్టీ నుంచి ఇబ్రహీం పట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. భారీ అంచనాల నడుమ ఆయన రంగంలోకి దిగినా.. ఇక్కడ ఆయన గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.
ఇక, అప్పటి నుంచి కూడా రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా కంచర్ల తెరమీదికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నానని తెలిపారు. అంతేకాదు.. తన గెలుపు కోసం.. సొంత అల్లుడు అల్లు అర్జున్ ప్రయత్నిస్తానని, హామీ ఇచ్చినట్టు చెప్పారు. అంతేకాదు.. కంచర్లకు అనుకూలమైన నియోజకవర్గం కూడా చూసి పెడతానని.. తానే దగ్గరుండి ప్రచారం నిర్వహిస్తానని కూడా హామీ ఇచ్చినట్టు చంద్రశేఖరరెడ్డి తాజాగా వివరించారు.
ఒక్క అల్లు అర్జున్ మాత్రమే కాకుండా.. మెగా కుటుంబం అంతా కూడా తన వెంటే ఉందని చంద్రశేఖరరెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తన తరఫున ఈ కుటుంబం కూడా కృషి చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తమ కుటుంబం పట్ల ఎంతో ప్రేమతో ఉంటారని.. ఆయన ను చూసి తాను గర్వపడుతున్నానని చంద్రశేఖరరెడ్డి వివరించారు.