Begin typing your search above and press return to search.
కేసీఆర్ మంట పుట్టే మాటలు చెప్పిన కంచె ఐలయ్య
By: Tupaki Desk | 18 Nov 2019 5:44 AM GMTతెలుగు ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అందరూ నడిచే బాటలో నడవన్నట్లుగా ఆయన వాదనలు.. సిద్ధాంతాలు.. ఆలోచనలు ఉంటాయని చెప్పాలి. అందరికి తెలిసిన విషయాన్ని ఆయన చూసే విధానం వేరుగా ఉంటుంది. విషయాల పట్ల ఆయనకుండే అవగాహన రోటీన్ కు కాస్త భిన్నంగా ఉంటుంది. తెలుగు మీడియాలో ఆయన పెద్దగా ఫోకస్ కారు కానీ.. ఇంగ్లిషు.. హిందీ మీడియాలలో ఆయనకు పెద్దపీట వేస్తారు.
ఆయన మాటలకు విపరీతమైన విలువను ఇస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. విషయం ఏదైనా సరే.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పటం.. జంకు బొంకూ లేకుండా మాట్లాడటం లాంటివి ఐలయ్యకు అలవాటు. తాజాగా ఆయనో ఇంటర్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రాంతం నష్టపోతుందని తాను ఉద్యమ సమయంలోనే చెప్పానని చెప్పారు కంచె ఐలయ్య. తెలంగాణ ఏర్పాటు కొత్తల్లో రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చూపించే ప్రయత్నం జరిగిందని.. అందులో భాగంగానే రైతుబంధు.. పెన్షన్ పథకాల్ని ప్రవేశ పెట్టారన్నారు.
ఈ పథకాలు ఎన్నికల్లో గెలవటానికి ఉపయోగపడ్డాయని.. సామాజిక పురోగతికి అడ్డంకిగా మారిన వైనాన్ని గుర్తు చేశారు. కోస్తాలోని అభివృద్ధి చెందిన ప్రాంతాలు తెలంగాణ నుంచి విడిపోవటం వల్ల రాష్ట్రం మధ్యప్రదేశ్ గా మారుతుందని తాను ముందే హెచ్చరించారన్నారు.
హైదరాబాద్ మహానగరం రానున్న రోజుల్లో సాదాసీదా భోపాల్ నగరంగా దిగజారే అవకాశం ఉందన్నారు. తన అంచనా తప్పలేదని.. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఉందని.. తీర ప్రాంతం ఉన్న ప్రాంతాలే అభివృద్ధి చెందుతాయన్నారు. తాను ఉద్యమం మొదట్లోనే తెలంగాణ వస్తే నష్టమని చెప్పినట్లు స్పష్టం చేశారు. కంచె ఐలయ్య నోటి నుంచి వచ్చిన మాటలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంట పుట్టేలా చేయటమే కాదు.. ఐలయ్య మీద విరుచుకుపడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.