Begin typing your search above and press return to search.
డేవిడ్ వార్నర్ పై వేటు..!
By: Tupaki Desk | 1 May 2021 1:30 PM GMTఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ సాగించిన ప్రమోషన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. బాహుబలిలో ప్రభాస్ కటౌట్ కు వార్నర్ ముఖం తగిలించి.. ‘‘ఊపిరి పీల్చుకో హైదరాబాద్.. వార్నర్ తిరిగొచ్చాడు’’ అంటూ సోషల్ మీడియాలోకి వదిలింది. ఈ కటౌట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ.. సీజన్ సగం కూడా పూర్తికాకుండానే కెప్టెన్ ను పక్కన పెట్టేయడం గమనార్హం.
ఈ సీజన్ లో వరుస పరాజయాలు చవి చూస్తుండడమే కారణం. 2021 సీజన్ ను ఓటమితో మొదలు పెట్టిన సన్ రైజర్స్.. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడగా ఐదింటిలో ఓడిపోయింది. దీంతో.. జట్టు తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. అంతేకాకుండా.. కెప్టెన్ వార్నర్ పై విమర్శల తీవ్రత పెరిగింది.
రేపు రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ లోగానే యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జట్టు కెప్టెన్ గా వార్నర్ ను పక్కన పెట్టి, కేన్ విలియమ్సన్ కు కట్టబెట్టింది. వరుస పరాజయాల నేపథ్యంలో కెప్టెన్ ను మార్చాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. చాలా మంది మాజీలు విలియమ్సన్ కే ఓటు వేశారు. చివరకు యాజమాన్యం కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
వార్నర్ 2015లో జట్టు పగ్గాలు చేపట్టాడు. ఆ సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచింది సన్ రైజర్స్ టీమ్. 2016లో మాత్రం అద్భుతమైన పోరాటపటిమతో జట్టును ఛాంపియన్ గా నిలిపాడు వార్నర్. 2017లో నాలుగో స్థానంలో, 2020లో మూడో స్థానంలో నిలిపాడు. ఇప్పుడు వరుస పరాజయాల నేపథ్యంలో కెప్టెన్సీని కోల్పోవడం గమనార్హం. బహుశా ఈ పరిస్థితిని వార్నర్ కూడా ఊహించి ఉండకపోవచ్చు.