Begin typing your search above and press return to search.
గ్రేటర్ ఫలితాలపై కంగన ట్వీట్.. కాంగ్రెస్ పై సెటైర్లు
By: Tupaki Desk | 4 Dec 2020 3:58 PM GMTజీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా అందరిలో ఆసక్తి రేపాయి. ఎక్కడో ముంబైలో ఉండే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రౌనత్ కూడా ఈ ఎన్నికలపై స్పందించడం విశేషం. అయితే తన ప్రత్యర్థి పార్టీతో కలిసి సాగుతున్న కాంగ్రెస్ పై కంగనా సెటైర్లు వేశారు. జీహెచ్ఎంసీలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పై హాట్ కామెంట్స్ చేశారు.
తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. ‘గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఇప్పటి వరకు 40 స్థానాలు గెలిచింది. కాగా కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది’ అని కంగన ఆడిపోసుకుంది..
కాంగ్రెస్ పార్టీపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించింది ‘ప్రియమైన కాంగ్రెస్.. మీ పార్టీ అధికారంలో పలు రాష్ట్రాల్లో కంగనా కంగనా అంటూ నా నామం జపం చేస్తూ గందరగోళం చేస్తుంటే.. బీజేపీ మాత్రం తన పాలనతో క్లిష్టమైన నగరాల్లో ప్రజల హృదయాలను గెలుచుకుంది. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంది’ అంటూ కంగనా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసింది.
కొద్దిరోజులుగా కంగనా బీజేపీకి మద్దతుగా మాట్లాడుతోంది. మహారాష్ట్రలో కొలువైన శివసేన-కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో కంగనా విమర్శలు గుప్పించింది.