Begin typing your search above and press return to search.
భారత క్రికెటర్లపై కంగనా వివాదాస్పద ట్వీట్.. తొలగించిన ట్విట్టర్..!
By: Tupaki Desk | 4 Feb 2021 2:20 PM GMTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ వస్తున్న ప్రముఖులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫైర్ అవుతూ వస్తోంది. నిరసన తెలుపుతున్న అన్నదాతలను ఉగ్రవాదులుగా పోల్చిన కంగనా.. బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ రైతుల నిరసనకు సపోర్ట్ చేసే ప్రముఖులపై వ్యగ్యంగా ట్వీట్స్ చేస్తూ వస్తోంది. బాలీవుడ్ హీరో దిల్ జిత్ దోసాన్హాతో మాటల యుద్ధానికి దిగింది. అలానే అంతర్జాతీయ పర్యావరణ వేత్త గ్రెటా థన్ బర్గ్ - పాప్ సింగర్ రిహానా లపై కంగన తనదైన రీతిలో స్పందించింది. తాజాగా ఇండియన్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ట్వీట్ పై రియాక్ట్ అయింది.
రోహిత్ శర్మ ట్విట్టర్ వేదికగా రైతుల నిరసనకు మద్దతు తెలిపారు. 'మన దేశ ఆర్థిక వ్యవస్థలో రైతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మన పాత్ర మనం పోషిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. మనమంతా కలిసి ఉన్నప్పుడు భారత్ ఎల్లవేళలా శక్తిమంతంగా ఉంటుంది. ఒక సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన సమయం ఇది' అని #IndiaTogether అనే హ్యాష్ ట్యాగ్ తో రోహిత్ ట్వీట్ చేశాడు. అయితే దీనిపై కంగనా స్పందిస్తూ భారతీయ క్రికెటర్లను 'ధోబీకా కుట్టా' అని అభివర్ణిస్తూ అభ్యంతరకర ట్వీట్ పెట్టింది. ''ఈ క్రికెటర్లంతా ధోబీ కా కుట్టా(గాడిద)లా ఎందుకు అరుస్తారు. (ధోబీ కా కుట్టా న ఘర్ క నా ఘట్ కా?) వారి అభివృద్ధి కోసం విప్లవాత్మకంగా రూపొందించిన చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. వీరంతా ఉగ్రవాదులు కాబట్టే ఈ గందరగోళం కల్పిస్తున్నారు'' అని కంగనా ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ వివాదాస్పదమైనది కావడంతో దీన్ని తొలగిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ట్విట్టర్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు వాటిని తొలగిస్తున్నామని తెలుపుతూ.. కొన్ని గంటల పాటు కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతానూ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.