Begin typing your search above and press return to search.

ఆదిత్యఠాక్రే, జయబచ్చన్ పై కంగన నిప్పులు

By:  Tupaki Desk   |   17 Sept 2020 11:24 PM IST
ఆదిత్యఠాక్రే, జయబచ్చన్ పై కంగన నిప్పులు
X
సుశాంత్ సింగ్ ఆత్మహత్య, డ్రగ్స్ దందాలో మహారాష్ట్రలోని శివసేన సర్కార్ పై నిప్పులు చెరుగుతున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ తాజాగా సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు , మంత్రి ఆదిత్య ఠాక్రేను టార్గెట్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో తీవ్ర ఆరోపణలు చేసింది.

తాను ఆదిత్య ఠాక్రే స్నేహితురాలు కాకపోవడం వలనే మహారాష్ట్ర సర్కారు తనపై కక్షపట్టి కార్యాలయాన్ని ధ్వంసం చేయించిందని మండిపడ్డారు. ఈ చర్యతో తాను అత్యాచారానికి గురైనంత బాధ అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదిత్యకు సన్నిహితుడైన కరణ్ జోహర్ కు ప్రత్యేక సదుపాయాలున్నాయని వెల్లడించారు. మహారాష్ట్రలో పాలన యాంత్రాంగం మారాలని ఆమె అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో పాలన యాంత్రాంగం మారాలని ఆమె అభిప్రాయపడ్డారు.

బాలీవుడ్ ను వెనకేసుకొచ్చిన ఎంపీ జయబచ్చన్ పైన కంగనా విమర్శలు కురిపించారు. చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వాడకం ఉందంటూ బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ ఇటీవల వ్యాఖ్యానించగా చిత్ర పరిశ్రమలో అందరూ అలాంటి వారు కాదంటూ జయ బచ్చన్ స్పందించిన సంగతి తెలిసిందే. కొంతమంది కారణంగా మొత్తం పరిశ్రమను తప్పుబట్టరాదని.. అన్నం తినే పళ్లానికి రంధ్రాలు పెట్టకూడదని ఆమె రాజ్యసభలో పేర్కొన్నారు.

నేను పరిశ్రమకు స్త్రీవాదాన్ని నేర్పించానని.. బాలీవుడ్ లో దేశభక్తి చిత్రాలను తీశాను.. ఇది మీ పరిశ్రమ మాత్రమే కాదు జయాజీ అన్న అర్థం వచ్చే ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.