Begin typing your search above and press return to search.

రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న కంగన రౌనత్

By:  Tupaki Desk   |   15 Sep 2020 4:00 PM GMT
రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న కంగన రౌనత్
X
మహారాష్ట్ర సర్కార్ తో వార్ పెట్టుకున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ తాజాగా ముంబై కార్పొరేషన్ తో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయ్యింది. ఇటీవల ముంబై కార్పొరేషన్ కంగనా కార్యాలయాన్ని కొంత భాగం అక్రమమంటూ కూల్చివేసింది. దీంతో ఈ చర్య చట్టవిరుద్ధమని పేర్కొంటూ కంగనా తాజాగా రూ.2 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.

బంద్రాలోని కంగనా రౌనత్ భవనం అక్రమంటూ ఇటీవల ముంబై కార్పొరేషన్ కూల్చింది. శివసేన సర్కార్ పై నోరుపారేసుకున్న కంగనకు ఇలా షాకిచ్చారు. దీంతో కంగనా రెచ్చిపోయి ముంబైలో రచ్చ చేసింది. శివసేన నేతలకు , కంగనాకు పెద్ద ఫైట్ నడుస్తోంది.

కంగన కార్యాలయాన్ని శివసేన సర్కార్ కూల్చివేస్తుండగా.. కంగన హైకోర్టును ఆశ్రయించడంతో స్టే లభించింది. ఈ క్రమంలోనే కంగన ముంబై కార్పొరేషన్ చర్యపై గతంలో వేసిన పిటీషన్ ను సవరించుకున్నట్టు కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

తనకు బీఎంసీ రూ.2 కోట్లు చెల్లించాల్సిందేనని సవరణ పిటీషన్ లో ఆమె కోరారు. తన బంగ్లా లోని 40శాతాన్ని బీఎంసీ కూల్చేసినట్లు ఆమె క్లెయిమ్ చేశారు. ఈ పిటీషన్ పై ముంబై హైకోర్టు వచ్చేవారంలో వాదనలు వింటుంది. దీంతో బంగ్లాలో తాము కూల్చివేసిన భాగం అనధికారికమైనది బీఎంసీ రుజువు చేయాల్సి ఉంటుంది. అలా చేయలేని పక్షంలో కోర్టు ఉత్తర్వులకు లోబడి కంగనకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.