Begin typing your search above and press return to search.

కోర్టులకు వచ్చేదే లే.. కంగనా మొండిపట్టు

By:  Tupaki Desk   |   23 Dec 2021 9:30 AM GMT
కోర్టులకు వచ్చేదే లే.. కంగనా మొండిపట్టు
X
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్, వివాదాస్పద నటి కంగనా ఏదో ఒక వివాదాన్ని రాజేయనిదే పూట గడిచేలా లేదు. కొన్నాళ్లుగా బీజేపీ భక్తురాలిగా మారిన కంగనా నోటికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. బాలీవుడ్ లో రెబల్ అనిపించుకున్నా.. క్రమంగా కంగనా తీరు విచిత్రంగా మారిపోయిందన్న వాదన వినిపిస్తోంది.

బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్న కంగనా.. బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిపై కూడా అనుచిత ప్రేలాపనకు దిగుతుండడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె బాధితులు వరుసగా కోర్టులను, పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు.

అయితే ఎన్ని కేసులు పెట్టినా కంగనా మాత్రం కోర్టులను లెక్కచేయడం లేదు. తగ్గేదేలే అంటోంది. రచయిత జావేద్ అక్తర్ వేసిన పరువు నష్టం కేసులో ఇప్పటివరకూ 11 సార్లు కోర్టు పిలిచినా కంగనా హాజరు కాలేదంటే ఆమె ఎంత దురుసుగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తనకు ఆ కేసును విచారిస్తున్న కోర్టుపై నమ్మకం లేదని.. జావేద్ పిటీషన్ ను మరో కోర్టుకు మార్చాలని కంగనా డిమాండ్ చేస్తోంది. అయితే ఇప్పటికే ఒకసారి కోర్టు అందుకు నిరాకరించింది. కంగనా మాత్రం కోర్టు కు హాజరు కాలేదు.

ఆమెపై కేసు వేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు జావేద్ అక్తర్. ఆయన అటెండ్ అయినా ఈమె మాత్రం అటెండ్ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే కంగనాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని జావేద్ లాయర్ కోర్టును కోరారు. మరి ఇప్పుడైనా బెట్టు వీడి కంగనా కదులుతుందా? లేదా? అన్నది చూడాలి.

- అసలు వివాదం ఏంటంటే?

కేంద్రంలోని బీజేపీ తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులను ఉద్దేశించి ‘ఖలిస్తాన్ ఉగ్రవాదులు’ అంటూ కంగనా వ్యాఖ్యానించింది. దీంతో ఆమెపై ముంబైలో కేసు నమోదైంది. సిక్కులను ఉద్దేశించి ఖలిస్తాన్ ఉగ్రవాదులు అని ఈమె వ్యాఖ్యానించి మరో వివాదం సృష్టించారు. దీనిపై ముంబైలో కొందరు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హాజరు కాకుండా కంగనా దురుసుగా వ్యవహరిస్తోంది.