Begin typing your search above and press return to search.
హిజాబ్ వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేసిన తాలిబన్లు, కంగనా రనౌత్
By: Tupaki Desk | 11 Feb 2022 8:30 AM GMTభారత్ లోని కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోన్న ‘హిజాబ్ వివాదం’పై అప్ఘనిస్తాన్ లోని తాలిబన్లు కూడా స్పందించారు. వారితోపాటు వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ వివాదంపై హాట్ కామెంట్స్ చేశారు. అవిప్పుడు దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలోని హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలకు తాలిబన్లు మద్దతు ప్రకటించారు. కర్ణాటకలోని ముస్లిం అమ్మాయిలు.. ఇస్లామిక్ విలువల కోసం నిలబడ్డారని తాలిబన్లు వారిని ప్రశంసించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం బాలికలు తమ మతపరమైన ఇస్తామిక్ విలువను కాపాడుకునే మార్గాల్లో త్యాగాలు చేశారని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అప్ఘనిస్తాన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగాని ట్వీట్ చేశారు. కర్ణాటకలోని అక్బర్ నిదానాలు చేసిన నల్ల బురఖా ధరించిన అమ్మాయి చిత్రాన్ని సమంగాని షేర్ చేశారు.
కర్ణాటకలోని ముస్లిం బాలికలు ‘లౌకికవాదం’ కోసం నిరసనలు చేస్తున్నారని సలీమ్ జావేద్ అనే పాకిస్తానీ చేసిన ప్రతిస్పందనపై కూడా అతడు తీవ్రంగా ప్రతిస్పందించాడు. హిజాబ్ ధరించిన అమ్మాయిలను ఖతార్ అధికారిక ప్రతినిధి సుహైల్ షాహీన్ వంటి సీనియర్ తాలిబన్ అధికారులు సమర్థించారు. తమ కాలేజీ డ్రెస్ కోడ్ ను ఉల్లంఘిస్తూ హిజాబ్ ధరించాలని డిమాండ్ చేస్తున్న ముస్లిం బాలికలకు తాలిబన్లు మద్దతు ప్రకటించారు.
-అప్ఘానిస్తాన్ లో చేతనైతే బుర్ఖా వేసుకోకుండా తిరగండి: కంగనా వివాదాస్పద కామెంట్స్
బాలీవుడ్ లో ఏ విషయం గురించి అయినా బెరుకు లేకుండా మాట్లాడే కొద్దిమందిలో కంగనా రనౌత్ ఒకరు. ఆమె కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడి వివాదాల్లో చిక్కుకుంటారు. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా కంగనా మరోసారి హిజాబ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ధైర్యం చూపించాలంటే అప్ఘనిస్తాన్ లో బురఖా ధరించకుండా చూపించండి.. విముక్తి పొందడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు పంజరంలో బంధించుకోకండి’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
అంతటితో ఆగకుండా.. ఆ విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తుల కోడ్ లను తొలగించేందుకు మద్దతిస్తున్న రచయిత ఆనంద్ రంగనాథన్ పోస్ట్ ను కంగన షేర్ చేసింది. ఆ పోస్ట్ లో 1973లో బికినీలో ఉన్న ఇరాన్ మహిళలు.. ప్రస్తుతం బురఖాలో ఉన్నారు. చరిత్ర నుంచి నేర్చుకోకుండా దాన్ని పునరావృతం చేయడం విచారకరం అని కంగనా హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.