Begin typing your search above and press return to search.
కంగనా రనౌత్ దాదాపు బీజేపీలో చేరినట్లేనా?
By: Tupaki Desk | 2 Oct 2021 4:31 AM GMTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బీజేపీకి అనుకూలంగా రాజకీయాలు చేస్తారన్న ప్రచారం సర్వత్రా ఉంది. ఆమె మహారాష్ట్రలోని శివసేన సర్కార్ తో కయ్యానికి కాలుదువ్విన తీరును చూసే ఉంటాం. మోడీకి మద్దతుగా మాట్లాడుతుంటారు. తాజాగా బీజేపీ పాలిత అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఓ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి కంగనా రనౌత్ రెడీ అయ్యారు.
కంగనా రనౌత్ తాజాగా యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ను లక్నోలో కలిసి భేటి అయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ భేటి జరగడం కాకరేపుతోంది. భేటి తర్వాత ఓ యూపీ ప్రభుత్వ పథకానికి కంగనాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకానికి కంగనాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారని తెలిపింది. సీఎం యోగి ప్రభుత్వ పాలనపై కంగనా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కంగనా రనౌత్ సేవలను వినియోగించుకోవాలన్న యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
బీజేపీ పట్ల గతంలోనే కంగనా సానుకూలత వ్యక్తం చేస్తూ బాహాటంగానే మద్దతుగా నిలుస్తున్నారు. అయితే బీజేపీలో చేరనున్నట్టు జరిగిన ప్రచారాన్ని మాత్రం ఎప్పటికప్పుడు తోసిపుచ్చారు. ‘తలైవి ’ సినిమా తర్వాత దివంగత జయలలితలానే కంగనా రనౌత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. పొలిటికల్ ఎంట్రీకి ఆమె నిర్ణయం తీసుకుంటే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషించారు. అయితే ఇప్పట్లో తనకు రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆలోచన లేదన్న కంగనా.. తాజాగా ప్రజలు కోరుకుంటేనే అది జరుగుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.