Begin typing your search above and press return to search.
కన్నయ్య పొలిటికల్ సీక్రెట్!
By: Tupaki Desk | 31 March 2019 7:51 AM GMTకన్నయ్యకుమార్...జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జెఎన్ యుఎస్ యు) మాజీ అధ్యక్షుడు. బీహార్ లోని బేగుసరాయ్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న విద్యార్థి నాయకుడు. బేగూసరాయ్ లోక్ సభ స్థానం నుంచి కన్నయ్య కుమార్ ను సీపీఐ తన అభ్యర్థిగా బరిలోకి దింపింది. బేగూసరాయ్ లో కేంద్ర మంత్రి - బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ను కన్హయ్య ఢీకొనబోతున్నారు. ఒక ఆంగన్ వాడీ కార్యకర్త కుమారుడైన కన్నయ్య కుమార్ ఇంటిని సీపీఐ నేత నారాయణ సందర్శించారు. బరౌనీ సమీపంలోని బిహాత్ గ్రామంలో అతి నిరుపేద కుటుంబమైన కన్నయ్య కుమార్ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ప్రచారంలో అతను ఎదుర్కొంటున్న సమస్యలను నారాయణ అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే గిరిరాజ్ సింగ్ బేగూసరాయ్ లో తన వర్గపు ఓట్ల లెక్కలు చూసుకొని టెన్షన్ పడుతున్నారు. బేగూసరాయ్ లో 2014 ఎన్నికల్లో బీజేపీకి చెందిన భోలా సింగ్ ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్ ను దాదాపు 58 వేల ఓట్ల తేడాతో ఓడించారు. భోలా సింగ్ కి సుమారు 4.28 లక్షల ఓట్లు వస్తే తన్వీర్ హసన్ కి 3.70 లక్షలు ఓట్లు పడ్డాయి. సీపీఐ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ సింగ్ 1,92,639 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. బేగూసరాయ్ లోక్ సభ సీటులో భూమిహార్ ఓటర్ల సంఖ్య అందరి కంటే అత్యధికంగా సుమారు 4.75 లక్షలు ఉన్నారు. ఇక్కడ 2.5 లక్షల ముస్లింలు - కుష్వాహా - కుర్మీలు దాదాపు 2 లక్సలు - యాదవ్ ఓటర్లు సుమారు 1.5 లక్షలు ఉన్నారు. వివాదాస్పద జేఎన్ యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ ని సీపీఐ రంగంలోకి దించిన తర్వాత ఈ పోరు ముక్కోణంగా మారింది. యువకుడైన కన్నయ్య - గిరిరాజ్ ఇద్దరూ భూమిహార్ వర్గానికి చెందినవారు. కన్నయ్య భూమిహార్ ఓట్లు చీల్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో తను ఓడిపోతానని గిరిరాజ్ భయపడుతున్నారు.
వామపక్షాలకు బేగూసరాయ్ అండగా ఉంటోంది. వామపక్ష ఆందోళనలు ముందుండి నడిపిన నేతలలో ఎక్కువ మంది భూమిహార్లే. 1967 సాధారణ ఎన్నికల్లో సీపీఐకి చెందిన యోగేంద్ర శర్మ ఇక్కడ గెలిచారు. ఆ తర్వాత పలు ఎన్నికల్లో కూడా బేగూసరాయ్ నుంచి లెఫ్ట్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల గత ఎన్నికల నుంచి పెద్ద సంఖ్యలో భూమిహార్లు బీజేపీ - జేడీయుకి మద్దతు ఇస్తున్నారు. 2004 నుంచి గత ఎన్నికల వరకు ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థులు నెగ్గుతూ వస్తున్నారు. 2014లో గిరిరాజ్ సింగ్ బేగూసరాయ్ నుంచి పోటీ చేయాలనుకున్నారు, కానీ ఆయనకు నవాడా టికెట్ ఇచ్చారు. భోలా సింగ్ మరణం తర్వాత బీజేపీ గిరిరాజ్ సింగ్ కు బేగూసరాయ్ టికెట్ ఇచ్చింది. వర్గ సమీకరణలను దృష్టిలో పెట్టుకుంటే భూమిహార్లు - బ్రాహ్మణులు - కాయస్థులు - కుర్మీ ఓట్ల బలంతో గిరిరాజ్ సింగ్ ఈ సీటులో బలంగానే ఉన్నారు.
ఇక, తాను పోటీ చేయడం గురించి ఓ వెబ్ సైట్ కు రాసిన కథనంలో కన్నయ్య క్లారిటీ ఇచ్చారు. ``ఔను. నేను ప్రమాదవశాత్తే రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయ వాదినే. కాని ఏ నాడు లోక్ సభకు పోటీ చేయాలని అనుకోలేదు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తోటి విద్యార్థుల మధ్య లోక్ సభ ఎన్నికల గురించి ప్రస్థావన వచ్చినప్పుడు మనమూ పోటీ చేస్తే! అనే మాట వచ్చి నవ్వుకునే వాళ్లం. కానీ పోటీ చేయాలని నిజంగా ఎన్నడూ అనుకోలేదు. ధనవంతుల జేబుల్లో చిక్కుకున్న రాజకీయ వ్యవస్థను వెలికితీసి పన్ను చెల్లించే సామాన్యుల చేతుల్లో పెట్టేవరకు పోరాడాలి. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను’ అని వెల్లడించారు.
మరోవైపు - ప్రజల మద్దతు - ప్రజల సహాయంతో తాను ఎన్నికలలో పోటీచేస్తానంటూ ప్రకటించిన కన్నయ్య కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమ నిధి కోసం సహకారాన్ని అందించాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు. 'మీకు ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే.. నేను మీ మద్దతు కోరుతున్నాను. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నది. ధన బలం - ప్రజా బలం మధ్య జరుగుతున్న పోరాటం ఇది' అని కన్నయ్యకుమార్ తన మూడు నిమిషాల వీడియో క్లిప్ లో దాతలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం సహాయ నిధికి రెండు రోజుల్లో రూ. 24 లక్షలు వసూలయ్యాయి. స్థానికుల్లో అత్యధికంగా యువకులు - అలాగే దేశవ్యాప్తంగా యువకుల నుంచి మద్దతు లభిస్తున్నదని కన్నయ్య ఎన్నికల సహాయ నిధికి సేకరణకు నేతృత్వం వహిస్తున్న సుశీల్ కుమార్ చెప్పారు. 'క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆన్ లైన్ లో గురువారం నాటికి రూ. 24 లక్షలు సమకూరాయి. స్థానికుల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తున్నది' అని సుశీల్ కుమార్ చెప్పారు. బేగుసరరులో ఏడో విడతగా ఏప్రిల్ 29న ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.