Begin typing your search above and press return to search.
‘‘మనువాదం’’ మాట వెనుక మాస్టర్ ప్లాన్ ఉందా?
By: Tupaki Desk | 25 March 2016 5:30 PM GMTప్రతి సంఘటనకు మరో సంఘటనకు లింకు ఉంటుందన్న ఒక సిద్ధాంతాన్ని పలువురు ప్రస్తావిస్తుంటారు. లోతుగా చూస్తే ఈ మాటలోని మర్మం ఇట్టే కనిపిస్తుంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ఒక కోణంలో మాత్రమే చూసే వారు.. అసలు కారణాల మీద అస్సలు దృష్టి సారించలేరు. ఎన్నడూ లేని విధంగా కన్నయ్య అనే విద్యార్థి నాయకుడి విషయంలో జాతీయ మీడియా అమితంగా ప్రాధాన్యం ఇస్తోంది. హిందుత్వం.. మనువాదం.. అంటూ విరుచుకుపడుతూ.. దళితులు.. అణగారిన వర్గాలు అంటూ అతగాడి నోటి వెంట వచ్చే మాటలకు పెద్దపీట వేయటం కనిపిస్తుంది.
కన్నయ్య మాటలకు ఓపక్క కమ్యూనిస్ట్ నేతలు.. మరోవైపు కాంగ్రెస్ నేతలు వత్తాసు పక్కాగా కనిపిస్తుంది. కన్నయ్యకు ఆయా రాజకీయ పార్టీలు గొంతుకలుగా మారి.. అతడు చేస్తున్న పిడి వాదానికి తమ శక్తిమేర ప్రచారాన్ని ఇవ్వటం.. మోడీ సర్కారు హిందుత్వానికి వ్యతిరేకంగా అన్నట్లు ప్రచారాన్ని చేయటం గమనించొచ్చు.
అయితే.. ఇదంతా ఈ మధ్యనే ఎక్కువ కావటం ఏమిటి? దీని వెనుక అసలు కారణం ఏమైనా ఉందా? అన్న ప్రశ్న వేసుకొని.. సాపేక్షంగా ఆలోచిస్తే.. ఈ ఆందోళనల వెనుక కొత్త కోణం కనిపిస్తుంది. ఆ మధ్య దేశ వ్యాప్తంగా ‘‘అసహనం’’ అన్న మాట భారీగా వినిపించటమే కాదు. దేశంలో ఒక మారుమూల ప్రాంతాన జరిగిన ఒక్క ఘటనతో.. మేధావులు మొదలుకొని వివిధ పార్టీల నేతలు.. సెలబ్రిటీల నోట.. అసహనం.. అసహనం అన్న మాట పెద్ద ఎత్తున వినిపించింది. ఈ మాట మీద టన్నుల కొద్దీ న్యూస్ ప్రింట్ ను అక్షరాలతో నింపేశారు. అంత భారీగా జరిగిన చర్చ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి దారుణ ఓటమి చెందిన వెంటనే ఒక్కసారిగా మాయమైంది. అప్పటివరకూ దేశాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్యగా అభివర్ణించిన అసహనం అనే మాట అడ్రస్ లేకుండా పోవటం గమనించొచ్చు.
బీహార్ ఎన్నికల సమయంలోనే బలంగా వినిపించిన అసహన నినాదానికి తగ్గట్లే.. తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలోనే కన్నయ్య అండ్ కో హడావుడి కనిపించటం మర్చిపోకూడదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా.. సరికొత్త భావోద్వేగాల్ని స్పృశించేలా కొంగొత్త నినాదాలు వినిపించటం గమనార్హం. ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసేలా జరుగుతున్న హడావుడి.. తమ లక్ష్యం పూర్తి అయిన వెంటనే.. వాటిని మళ్లీ తలవకపోవటం చూసినప్పుడు అసలు విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఓట్ల రాజకీయం కోసం దేశంలో భావోద్వేగ చీలికలు తెచ్చే ప్రయత్నం అవసరమా? అన్న ప్రశ్న రాక మానదు. రాజకీయాలు మరీ ఇంత నీచంగా ఉండాలా..?