Begin typing your search above and press return to search.

రాజధానిపై కేంద్రం నిర్ణయమిదే: కన్నా

By:  Tupaki Desk   |   5 Jan 2020 10:43 AM GMT
రాజధానిపై కేంద్రం నిర్ణయమిదే: కన్నా
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ఏపీ రాజధాని అమరావతి తరలింపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిపై కేంద్ర నిర్ణయాన్ని చూచాయగా వెల్లడించారు.

కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘ఏపీ రాజధాని అమరావతిలో ఉండాలన్నదే బీజేపీ ముఖ్య ఉద్దేశం’ అని కుండబద్దలు కొట్టారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదేనని.. కానీ తరలింపుపైన స్టేక్ హోల్డర్స్ అభిప్రాయం కీలకమని స్పష్టం చేశారు.అమరావతిలో చేసిన ఖర్చులో నిధులు కూడా ఉన్నాయని వివరించారు.

సచివాలయం, అసెంబ్లీ ఒకే చోట ఉండాలనేది తమ అభిమతమని కన్నా చెప్పుకొచ్చారు. రాజధాని తరలింపు కుట్ర అని.. అమరావతిలోనే రాజధాని ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

కన్నా అభిప్రాయమే కేంద్రం అభిప్రాయం అనుకుంటే.. అమరావతి రాజధానిని విశాఖ తరలింపుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యతిరేకమని అర్థమవుతోంది. మరి కేంద్రంలోని సభ్యులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.