Begin typing your search above and press return to search.

జగన్ కు ఇప్పుడు 23 సీట్లు కూడా రావంట

By:  Tupaki Desk   |   2 March 2020 8:00 AM GMT
జగన్ కు ఇప్పుడు 23 సీట్లు కూడా రావంట
X
అధికారంలోకి తొమ్మిది నెలలు కూడా పూర్తి కాలేదు.. రాష్ట్ర పరిస్థితిని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుని ఎలా పాలించాలో నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ నాయకులు విమర్శలు మొదలుపెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఎత్తిపొడుస్తున్నారు. విమర్శల ఘాటు పెంచి అధికార పార్టీపై మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తొమ్మిది నెలల అతడి పాలనతో ప్రజా వ్యతిరేకతను బాగా మూటగట్టుకున్నారని కన్నా తెలిపారు. అధికార వికేంద్రీకరణ అంటూ దురుద్దేశంతోనే మూడు రాజధానుల ప్రకటన చేశారని ఆరోపించారు. జగన్ ఎన్ని చేసినా తాము రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఆ ప్రజా వ్యతిరేకత ప్రభావం ఎంత ఉందంటే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే జగన్‌కు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లు కూడా రావంటూ జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలు అమరావతి రాజధానిగా కొనసాగాలని రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలుపుతూ తుళ్లూరు నిర్వహించిన దీక్షా శిబిరంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు.

రాష్ట్రంలో జగన్‌ పాలన సాగుతోందో.. పోలీసు పాలన సాగుతోందో అర్థం కావట్లేదని తెలిపారు. రాజధాని పేరుతో తమ భూములు కబ్జా చేస్తారనే భయంతో విశాఖపట్టణ ప్రజలు హడలి పోతున్నారని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతికి తాము కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు. రాజధాని అమరావతి కొనసాగాలనే విషయంలో త్వరలోనే తమ భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. అయితే బీజేపీ పెద్దలు జగన్ నిర్ణయానికి అనుకూలంగా ఉండగా రాష్ట్ర నాయకులు మాత్రం వ్యతిరేకంగా ఉండడంతో పార్టీ కమలం శ్రేణులు గందరగోళంలో ఉన్నారు. ఏదో ఒక స్టాండ్ తీసుకోకపోతే ఎలా ప్రశ్నిస్తున్నారు.