Begin typing your search above and press return to search.
పవన్ బీజేపీకి దూరం కాలేదు..నేను పార్టీ మారబోను
By: Tupaki Desk | 16 Jan 2018 3:51 PM GMTకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉండి, బీజేపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల బీజేపీలో నెలకొన్న పరిణామాలపై ఆసక్తికరమైన రీతిలో స్పందించారు. టీడీపీ - బీజేపీ సంబంధాలు సహా తన రాజకీయ జీవితం గురించి కూడా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. కేంద్రంపై తప్పుడు ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం ఊతం ఇస్తుందని కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరంలో ఖర్చు చేసిన ప్రతీ రూపాయి కేంద్రం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, పోలవరం అంచనాలను ఒక్కోసారి ఒక్కో అంకె ఇస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టిసీమ ఖర్చును పోలవరం లెక్కల్లో చూపిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు.
బీజేపీలో చేరి తప్పు చేశానని తాను అనుకోవడం లేదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీ బీజేపీని హైకమాండ్ వదిలేసిందని తాము భావిస్తున్నామని అయితే సరైన సమయంలో తప్పకుండా దృష్టి సారిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు టీడీపీతో ఉండాలని లేదని, తాము ప్రభుత్వంలో ఉన్నామనే భావన కార్యకర్తలలో లేదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలను సందర్భం వచ్చినప్పుడు తాము అధిష్టానికి చెబుతామన్నారు. తుదిశ్వాస వరకు బీజేపీలోనే అని తేల్చిచెప్పిన కన్నా లక్ష్మీనారాయణ తాను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు. తనకు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఆహ్వానం, ఒత్తిడి ఉందని చెప్పారు. అయితే ఆ రెండు పార్టీలకు తాను పార్టీ మారబోనని క్లారిటీ ఇచ్చినట్లు తేల్చిచెప్పారు. పదవుల కోసం తాను పార్టీలు మారబోనని...పనిచేస్తే..పదవులు వాటంతట అవే వస్తాయని వ్యాఖ్యానించారు. తాను మోడీ నాయకత్వంలోనే చనిపోయేదాకా పని చేస్తానని కన్నా లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ మిత్రపక్షంగా ఉండటం వల్ల టీడీపీకి ఉపయోగపడుతోందని, కాని వారికి ఆ ఆలోచన లేదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీకి టీడీపీ గౌరవం ఇవ్వడం లేదు, నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి టీడీపీ అన్యాయం చేస్తోందని కన్నా ఆరోపించారు. తాము ఎక్కడ బలపడతామో అనే ఆవేదన టీడీపీకి ఉందన్నారు. అందుకే తనతో పాటుగా పురందీశ్వరిని టీడీపీ టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ-బీజేపీ మధ్య తాము గొడవలు పెట్టలేదని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చారని ఆయన తెలిపారు. తాను ఎన్డీఏలో లేనని పవన్ వెల్లడించడం లేదని...అదే రీతిలో తాము సైతం అనడం లేదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.