Begin typing your search above and press return to search.
పోలవరంలో మీరు కాంట్రాక్టర్లా - బ్రోకర్లా..?: కన్నా
By: Tupaki Desk | 8 Jan 2019 8:20 AM GMTటీడీపీ - బీజేపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఏపీని మోదీ మోసం చేస్తున్నారని చంద్రబాబు విమర్శిస్తుంటే.. ఇచ్చిన నిధులకు లెక్కలు చూపించడం లేదంటా బీజేపీ శ్రేణులు చంద్రబాబు సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ఇప్పుడు ఈ వైరానికి మరింత ఆజ్యం పోశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ట్విట్టర్ సాక్షిగా చంద్రబాబు నాయుడిపై చెలరేగిపోయారు. పోలవరం ప్రాజెక్టులో మీరు బ్రోకర్లా - కాంట్రాక్టర్లా అంటూ పరుష పదజాలంతో విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టులో భాగంగా కేవలం 24 గంట్లలో 32 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రిట్ వేయడం ద్వారా రెండు గిన్నిస్ బుక్ రికార్డులు ఏపీ ప్రభుత్వానికి సొంతమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు అధికారులు, కాంట్రాక్టర్లతో పాటు చంద్రబాబు కష్టపడ్డారు. రికార్డులు నెలకొల్పిన తర్వాత అక్కడే పైలాన్ ఆవిష్కరించారు. దీంతో.. అసలు చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా లేదా పోలవరం ప్రాజెక్టుకు గుత్తేదారా ఆంటూ విమర్శించారు కన్నా లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా ట్విట్టర్ లో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
“సోమవారం - పోలవరం అంటూ - బస్సు యాత్రలంటూ - ప్రారంభోత్సవాలంటూ నాటకాలు ఆడారు. ఇప్పుడు వరల్డ్ రికార్డులు అంటూ ఆర్బాటం చేస్తున్నారు. ప్రజలకు కుచ్చుటోపి పెట్టడానికి ప్రజల సొమ్మునే వృథా చేస్తున్న మీకు ఇదే మా సూటి ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పోలవరంలో మీ పాత్ర ఏంటి.? బ్రోకరా.? కాంట్రాక్టరా.? అంటూ ట్వీట్ చేసారు కన్నాలక్ష్మీ నారాయణ.