Begin typing your search above and press return to search.

బీజేపీతో వైసీపీ దోస్తీ ... కన్నా కీలక వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   15 Feb 2020 12:30 PM GMT
బీజేపీతో వైసీపీ దోస్తీ ... కన్నా కీలక వ్యాఖ్యలు!
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల్లో రెండుసార్లు హస్తన పర్యటనకి వెళ్లడం , అక్కడ వరుసగా ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షా తో పాటుగా పలువురు బీజేపీ కీలకనేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోకి వైసీపీ చేరుతుందన్న ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి.దీనికి మరింత ఊతం ఇస్తూ పురపాలక శాఖా మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి.

అయితే, తాజాగా దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము టీడీపీ వైసీపీ విధానాలకు వ్యతిరేకమని, ఇదే అంశంపై ఇప్పటికే తమ పార్టీ ఇంఛార్జ్‌ లు ప్రకటనలు చేశారని, సీఎం జగన్ పరిపాలనా పరమైన అంశాలపై ప్రధానితో, కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారని తెలిపారు. ఈ వరుస భేటీలకు రాజకీయాలకు సంబంధం లేదని అయన అభిప్రాయపడ్డారు. మంత్రి బొత్సా వ్యాఖ్యల వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆయన తెలిపారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కార్యకర్తలపై దాడులు పెరిగాయని కన్నా విమర్శించారు. కడప జిల్లాలో అక్రమ ఇసుక దందాను అడ్డుకున్న బీజేపీ నేతలపై దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ నేతలు కేసు పెడితే తిరిగి వారిపైనే కేసులు పెట్టారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని , కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.