Begin typing your search above and press return to search.
పోల'వారం' పేరుతో చంద్రబాబు క్యాట్ వాక్
By: Tupaki Desk | 16 Oct 2018 3:05 PM GMTఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు...భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. రాజధాని కోసం రైతులు త్యాగం చేసిన పచ్చటి పొలాలతో చంద్రబాబు, లోకేష్ లు వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం పేరుతో ప్రతి సోమవారం చంద్రబాబు క్యాట్ వాక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని, ఆ ప్రాజెక్టు బాధ్యతను ప్రధాని మోదీ తీసుకున్నారని అన్నారు. 2014లో తిట్టిన కాంగ్రెస్ తో 2019లో పొత్తుకు చంద్రబాబు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. అన్నం పెట్టిన చేతిని నరకడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొడతామన్నారు. అమరావతిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కన్నా...ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను మోదీ తీసుకున్నారని, రాష్ట్రం సహకరించకున్నా...ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కన్నా అన్నారు. కానీ, ఆ ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. సబ్ కాంట్రాక్టులతో కమిషన్లు, దళిత-గిరిజనులు భూముల పేరుతో దోచుకుంటోందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తోన్న నిధులన్నీ జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు వరకు దోచుకుంటున్నారని మండిపడ్డారు. రైతులిచ్చిన భూములతో చంద్రబాబు, లోకేష్‌లు వ్యాపారం చేస్తున్నారన్నారు. అమరావతి పేరుతో ఇటుకల నుంచి బాండ్ల వరకు అన్నీ అమ్ముకున్నారని మండిపడ్డారు. 2014లో కాంగ్రెస్ ను తీవ్రస్థాయిలో విమర్శించిన చంద్రబాబు....రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో అంటకాగేందుకు వెనుకాడడం లేదని అన్నారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొడతామని చెప్పారు.