Begin typing your search above and press return to search.

క‌న్నా వ‌ర్సెస్ సోము.. ఏపీ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది...!

By:  Tupaki Desk   |   23 Oct 2022 4:57 AM GMT
క‌న్నా వ‌ర్సెస్ సోము.. ఏపీ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది...!
X
రాజ‌కీయాల్లో కీల‌క నాయ‌కుల ప్ర‌భావం ఎప్పుడూ ఉంటుంది. ఈ క్ర‌మంలో వారి చుట్టు రాజ‌కీయాలు కూడా తిరుగుతుంటాయి. ఇప్పుడు ఇదే చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా జ‌రుగుతోంది. ఎలాగంటే.. బీజేపీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాను ఎన్నో ఆశ‌ల‌తో పార్టీలోకి వ‌చ్చాన‌ని.. కానీ, ఇప్పుడు అవ‌న్నీ క‌ల్ల‌లు అయ్యాయ‌ని.. ఆయ‌న పేర్కొంటున్నారు. ప్ర‌ధానంగా ఆయ‌న‌కు పార్టీ ఏపీ చీఫ్‌ సోము వీర్రాజుకు మ‌ధ్య చాలా గ్యాప్ పెరిగిపోయింది. గ‌తంలోనే వీరి మ‌ధ్య గ్యాప్ ఉన్న విష‌యం తెలిసిందే.

క‌న్నాకు.. బీజేపీ రాష్ట్ర‌ ప‌గ్గాలు అప్ప‌గించ‌డాన్ని సోము వీర్రాజు తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఆర్ ఎస్ ఎస్‌తో ఎలాంటి సంబంధం లేనివారికి.. అస‌లు ఆర్ ఎస్ ఎస్‌పై యుద్ధం చేసిన పార్టీ(కాంగ్రెస్‌) నుంచి వ‌చ్చిన వారికి.. బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ఏంట‌ని అప్ప‌ట్లో ప్ర‌శ్నించారు. అయినా.. పార్టీ అధిష్టా నం మాత్రం.. క‌న్నాకే మొగ్గు చూపింది. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో 2019 ఎన్నిక‌ల‌కు బీజేపీ వెళ్లింది. అయితే.. అప్ప‌టి రాజ‌కీయ వ్యూహాల నేప‌థ్యంలో బీజేపీ ఒంట‌రిగానే పోటీ చేయాల్సి వ‌చ్చింది.

దీంతో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. దీంతో త‌ర్వాత కాలంలో క‌న్నాను త‌ప్పించి.. సోము చేసుకున్న ఆర్ ఎస్ ఎస్ లాబీయింగ్ ఫలించి.. పార్టీకి ఆయ‌న చీఫ్ అయ్యారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. క‌న్నా.. పార్టీని పుట్టిముంచారు.. అని 2019 ఎన్నిక‌ల త‌ర్వా.త‌. విమ‌ర్శించిన సోము.. ఆయ‌న హ‌యాంలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోకానీ.. కార్పొరేష‌న్ స‌మ‌రంలో కానీ.. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ల్లో(తిరుప‌తి పార్ల‌మెంటు, బ‌ద్వేలు, నెల్లూ రు అసెంబ్లీ) కానీ.. క‌నీసం డిపాజిట్లు ద‌క్కించుకోలేక పోయారు.

ఇది సోముకు.. క‌న్నాకు మ‌రింత గ్యాప్ పెంచింది. ఈ క్ర‌మంలో సోము అనూహ్యంగా క‌న్నా ఇంటికి వెళ్లి మ‌రీ విందు ఆరగించి..మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఇద్ద‌రూ క‌లిసి పోయార‌ని అనుకున్నారు.కానీ, చేతులు క‌లిసినా.. మ‌న‌సులు మాత్రంక‌ల‌వ‌లేదు. ముఖ్యంగా.. కాపు వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న జ‌న‌సేనాని..ప వ‌న్‌ను సోము వీర్రాజు ప‌ట్టించుకోక‌పోవ‌డం.. క‌క‌న్నాకు మంటెత్తేలా చేసింది. ఆయ‌న వ‌ల్ల‌.. పార్టీకి ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని.. ప‌వ‌న్‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు వాడుకుందామ‌ని.. క‌న్నా సూచించినా.. సోము మాత్రం ఎక్క‌డా ప‌ట్టించుకోలేదు.

ఈ ప‌రిణామాల‌కు తోడు.. సోము వ్య‌వ‌హార శైలి కూడా.. పార్టీలో అగ్ర‌నాయ‌కుల‌కు ఇష్ట‌ప‌డ‌డం లేదు. పార్టీలో ఏం జ‌రుగుతోందో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి .. సోము కూడా.. ఎవ‌రితోనూ.. పార్టీ కార్యక్ర‌మాల‌పై మ‌న‌సు విప్పి మాట్లాడింది లేదు. ఆయ‌న అల్లుడిపై ఉన్న ఆర్థిక నేరానికి సంబంధించి.. అధికార పార్టీతో లాలూచీ ప‌డ్డార‌నే విమ‌ర్శ‌లు బీజేపీలో నే కొంద‌రు నేత‌లు చేసిన ప‌రిస్థితి క‌నిపించింది. అయితే..ఈ విమ‌ర్శ‌లు క‌న్నానే చేయించార‌ని.. సోము వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తోనే క‌న్నాకు.. సోముకుమ‌రింత చెడింది. మ‌రి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.